ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: కారును కాలువలోకి లాక్కెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌!

ABN, Publish Date - May 26 , 2024 | 05:03 AM

చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు.

  • కేరళలో ఘటన..హైదరాబాద్‌ వాసులకు తప్పిన ముప్పు

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు. కానీ కేరళ విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌ వాసులకు మాత్రం గూగుల్‌ మ్యాప్స్‌ ప్రమాదంలో పడేసింది. దాన్ని నమ్మి గుడ్డిగా ముందుకెళ్లిన వారి కారు కాలువలోకి దూసుకెళ్లింది. వారిని స్థానికులు కాపాడడంతో గండం గడిచింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఎస్‌యూవీ (ఫోర్డ్‌ ఎండీవర్‌)లో కేరళ టూర్‌ వెళ్లారు.


శనివారం రాత్రి ఇడుక్కి నుంచి అలప్పుజకు బయలుదేరారు. మార్గం తెలియకపోవడంతో గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా వాహనం నడుపుతున్నారు. రాత్రివేళ కావడం, వర్షం పడుతుండటంతో దారి కనిపించడం కష్టంగా ఉంది. కురప్పంతర ప్రాంతానికి చేరుకోగానే గూగుల్‌ మ్యాప్స్‌ రోడ్డు వైపు కాకుండా కాలువ వైపు వెళ్లాలని సూచించింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై నీరు నిలిచి ఉండవచ్చని భావించి కారు నడుపుతున్న వ్యక్తి మ్యాప్స్‌లో సూచించిన వైపు పోనిచ్చాడు. దాంతో కారు కాలువలోకి వెళ్లిపోయింది. అక్కడ లోతుగా ఉండడంతో కారు అద్దాల నుంచి బయటకొచ్చిన వారిని, స్థానికులు గమనించి కాపాడారు. కారు నీటిలో 150మీటర్లు మేర కొట్టుకుపోయింది. పోలీసులు, స్థానికులు కలిసి కారును బయటకు తీశారు. సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 05:03 AM

Advertising
Advertising