ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metro Rail: సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:38 AM

కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు కారిడార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

  • రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ. మార్గం

  • కేంద్రం వాటా 18%.. తెలంగాణది 30%

  • పాలనాపరమైన అనుమతి జారీ

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు కారిడార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. దీని కోసం అయ్యే మొత్తం వ్యయంలో 48 శాతాన్ని జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ నుంచి రుణంగా తీసుకోనుండగా, 30 శాతం మొత్తాన్ని (రూ.7,313 కోట్లను) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. 18 శాతాన్ని (రూ.4,230 కోట్లను) కేంద్రం వాటా కింద సమీకరిస్తారు. నాలుగు శాతాన్ని (రూ.1033 కోట్లను) ప్రైవేట్‌ భాగస్వామి పెట్టుబడిగా పెట్టనుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో, పరిపాలనాపరమైన అనుమతినిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్‌ శనివారం జీవోనెం.196 జారీ చేశారు. మెట్రో రెండో దశలో భాగంగా.. కారిడార్‌-4లో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దాకా 36.8 కి.మీ.లు, కారిడార్‌-5లో రాయదుర్గ్‌-కోకాపేట్‌ నియోపొలిస్‌ దాకా 11.6 కి.మీ.లు, కారిడార్‌-6లో ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట (పాతబస్తీ) వరకు 7.5 కి.మీ.లు, కారిడార్‌-7లో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు దాకా 13.4 కి.మీ.లు, కారిడార్‌-8లో ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ దాకా 7.1 కి.మీ.లు కలుపుకొని మొత్తం 76.4 కి.మీ.ల మేర మెట్రో రైలు లైను వేయనున్నారు. దీనికి అదనంగా, కారిడార్‌-9లో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీ (స్కిల్‌ వర్సిటీ) వరకూ 40 కి.మీ.ల మేర మరో లైనును కూడా ప్రతిపాదించారు. ఈ కొత్త లైనుపై ప్రస్తుతం అలైన్‌మెంట్‌, అంచనాల తయారీ, క్షేత్రస్థాయి సర్వే జరుగుతున్నాయి. వీటి అనంతరం దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా, రెండోదశకు పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో డీపీఆర్‌ను కేంద్రప్రభుత్వానికి పంపించనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టు పనులు మొదలవుతాయి.


  • ఏ మూల నుంచైనా ఎయిర్‌పోర్టుకు సులువుగా..

రెండో దశ విస్తరణ పనులను మొదటి దశలోని మూడు కారిడార్లకు అనుసంధానంగా చేపట్టనున్నారు. ప్రధానంగా నాగోల్‌-ఎయిర్‌పోర్టు కారిడార్‌ను వీలైనంతా త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 36.8 కి.మీ.ల ఈ కారిడార్‌ ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ దాటిన తర్వాత కర్మన్‌ఘాట్‌, ఓవైసీ ఆస్పత్రి, డీఆర్‌డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్‌, న్యూహైకోర్టు మీదుగా శంషాబాద్‌ జంక్షన్‌ నుంచి నేషనల్‌ హైవేపై వెళ్లనుంది. చాంద్రాయణగుట్టను ఇంటర్‌ఛేంజ్‌గా చేస్తుండటంతో ఇటు రాయదుర్గ్‌, అటు జేబీఎస్‌, మియాపూర్‌ నుంచి.. ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు సులభంగా వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. కాగా, రెండో దశలోని మొత్తం 5 కారిడార్లకు మంజూరు చేసిన రూ.24,269 కోట్లలో.. నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రూ.11,226 కోట్లు, రాయదుర్గ్‌-కోకాపేట్‌ నియోపోలీ్‌సకు రూ.4,318 కోట్లు, ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్టకు రూ.2,741 కోట్లు, మియాపూర్‌-పటాన్‌చెరుకు రూ.4,107 కోట్లు, ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌కు రూ.1,877 కోట్లు కేటాయించారు.


  • మొదటిదశలో అంచనాలను మించిన వ్యయం

మెట్రో మొదటి దశ ప్రాజెక్టును 2012లో ప్రారంభించారు. రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో చేపట్టిన పనులను 2017 నవంబర్‌లో పూర్తి చేశారు. అయితే పనులు పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.22,000 కోట్లకు పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు చేపట్టిన ఎల్‌అండ్‌టీకి నగరంలోని వివిధ ప్రాంతాల్లో 213 ఎకరాలను రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ) కింద అప్పగించారు.

Updated Date - Nov 03 , 2024 | 03:38 AM