ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: గ్రూప్‌-1 వాయిదా కుదరదు!

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:41 AM

గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయడం కుదరని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన, ప్రతిపక్షాల విమర్శలతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం

  • నేడు ప్రభుత్వం ప్రకటించే అవకాశం

  • అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రుల భేటీ

  • జీవో 29, 55లపై నిపుణులతో సంప్రదింపులు

గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయడం కుదరని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన, ప్రతిపక్షాల విమర్శలతో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో.. శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో జరిగిన ఈ భేటీలో పొన్నంతోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు.


జీఓ 29 సారాంశం ఏమిటి, ఆ జీఓ వల్ల ఏ వర్గాలకైనా నష్టం జరుగుతుందా, జీఓ 55లో ఏముంది, ఈ జీవోల వల్ల భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలుంటాయి అన్న అంశాలపై టీజీపీఎస్సీ అధికారులతోపాటు న్యాయనిపుణులతో మంత్రులు మాట్లాడారు. ఈ విషయంలో ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరగవద్దని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే, గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Updated Date - Oct 20 , 2024 | 03:41 AM