ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metro Phase II: నాలుగేళ్లలో మెట్రో రెండో దశ పూర్తి!

ABN, Publish Date - Oct 28 , 2024 | 04:57 AM

మెట్రో రెండో దశ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణాల ద్వారా 52శాతం నిధులను సమీకరించాలని నిర్ణయించింది.

  • రూ.24,269కోట్ల వ్యయంతో ప్రాజెక్టు

  • డీపీఆర్‌లకు మంత్రి వర్గం ఆమోదం

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మెట్రో రెండో దశ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణాల ద్వారా 52శాతం నిధులను సమీకరించాలని నిర్ణయించింది. పెరుగుతున్న హైదరాబాద్‌ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రెండవ దశ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌కు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 76.4కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి.


మొదటి దశలో మూడు కారిడార్లు ఉండగా, రెండో దశలో కొత్తగా 5 కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 36.8 కిలో మీటర్లు, రాయదుర్గ్‌ నుంచి కోకాపేట నియో పోలీస్‌ వరకు 11.6 కిలో మీటర్లు, ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, మియాపూర్‌ నుంచి పటన్‌చెర్వు వరకు 13.4 కిలో మీటర్ల మేర, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కిలో మీటర్ల మేర మెట్రోను నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం అంటే రూ.7313 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనున్నాయి. మిగిలిన 52 శాతం నిధులను రుణాలతోపాటు పీపీపీ విధానంలో సమకూర్చనున్నారు. ప్రస్తుతం రోజూ దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తుండగా... రెండో దశ అందుబాటులోకి వస్తే మరో 8 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 28 , 2024 | 04:57 AM