ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

University Vacancies: యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేక కమిషన్‌!

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:50 AM

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వివిధ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోవడంతో ఖాళీల సంఖ్య బాగా పెరిగిపోయాయి.

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వివిధ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోవడంతో ఖాళీల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ బోర్డు బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం గవర్నర్‌కు పంపగా.. గవర్నర్‌ ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకుపంపారు. దాంతో అప్పటి నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి కేంద్రీకరించింది. అయితే నియామక బోర్డు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా... మరో ఏజెన్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం సాధ్యంకాదని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఆమోదించిన నియామక బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నారు.


ఆ తర్వాత ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. కమిషన్‌ ఎలా ఉండాలి? ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలా? లేక ఉత్తర్వులతో దీన్ని ఏర్పాటు చేయవచ్చా? వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారం మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఈ వీసీల సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా వచ్చే ఏడాదిలో అమలుపరిచే కొత్త సిలబస్‌ రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో వచ్చే ఏడాది నుంచి సిలబ్‌సలో మార్పులు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆయా రంగాల్లో విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాలు లభించేలా ఈ సిలబ్‌సను రూపొందించాలనుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీల్లో నాణ్యతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపైనా చర్చించనున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 02:50 AM