ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy Criticism: రేవంత్‌ దెబ్బకు మీడియా పాయింట్‌కు కేసీఆర్‌

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:53 AM

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా బడ్జెట్‌ ఉందని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.

  • విప్‌లు లక్ష్మణ్‌, ఐలయ్య, రామచంద్రు, శ్రీనివాస్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా బడ్జెట్‌ ఉందని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి దెబ్బకు కేసీఆర్‌ మీడియా పాయింట్‌కు రావాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వైఖరి మార్చుకోకపోతే ఈసారి మీడియా పాయింట్‌కు కూడా రాలేరని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.


ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామని, భవిష్యత్తులోనూ పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల కోసం అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టి కమీషన్లు కొట్టేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు. వాస్తవ పరిస్థితుల మేరకు తమ ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించిందన్నారు. కేసీఆర్‌ చేసిన నిర్వాకంతో త్వరలోనే జైలుకు పోతారని అచ్చంపేట ఎమెల్యే వంశీకృష్ణ అన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 04:53 AM

Advertising
Advertising
<