Governor: రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలి: గవర్నర్
ABN, Publish Date - Aug 15 , 2024 | 01:34 AM
రక్తదాన శిబిరాలను విరివిగా చేపట్టి రక్త నిధులను పెంచాలని, సకాలంలో రక్తం అందించి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. రెడ్‌క్రాస్ ప్రతినిధులకు సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రక్తదాన శిబిరాలను విరివిగా చేపట్టి రక్త నిధులను పెంచాలని, సకాలంలో రక్తం అందించి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. రెడ్‌క్రాస్ ప్రతినిధులకు సూచించారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) రాష్ట్ర మేనేజింగ్ కమిటీ, జిల్లా శాఖల అధ్యక్షులు, సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఐఆర్‌సీఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న గవర్నర్.. వృద్ధులు, అనాథల సంరక్షణ కేంద్రాలు, జన ఔషధి మెడికల్ స్టోర్ల నిర్వహణ, యోగా కేంద్రాల ఏర్పాటు, పేదలు, వృద్ధుల కోసం వైద్య శిబిరాలు చేపట్టడంలో లోపాల్లేకుండా చూడాలన్నారు.
ఐఆర్‌సీఎస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ నార్కోటిక్ మూవ్‌మెంట్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారిని స్మరించుకోవడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యతని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాష్ట్ర ప్రజలకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ బుధవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Aug 15 , 2024 | 01:34 AM