Hyderabad: గ్రూప్-1లో 67.4 శాతం హాజరు
ABN, Publish Date - Oct 27 , 2024 | 04:42 AM
గ్రూప్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 కేంద్రాల్లో శనివారం పేపర్-5 నిర్వహించారు. 21,181 మంది హాజరయ్యారని టీఎ్‌సపీఎస్సీ
పేపర్-5 కఠినంగా వచ్చిందన్న అభ్యర్థులు
నారాయణమ్మ కాలేజీలో కాపీయింగ్‌కు యత్నం
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 కేంద్రాల్లో శనివారం పేపర్-5 నిర్వహించారు. 21,181 మంది హాజరయ్యారని టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. హాజరు 67.4 శాతంగా నమోదైంది. నారాయణమ్మ కాలేజీలో చేతిరాత చీటీలతో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలతో అతడు రాసుకొచ్చిన సమాధానాలు సరిపోలేదని గుర్తించిన వెంటనే పరీక్ష కేంద్రం నుంచి పంపించేశారు. అతడు భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది.
శనివారం జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ - డేటా ఇంటర్‌ప్రిటేషన్(డిఐ) పేపర్-5 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్-1లో తొలిసారి ఈ పేపర్‌కు 50 మార్కులు కేటాయించారు. 30 ప్రశ్నలకు 25 రాయాల్సి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు రెండు మార్కులు. ఒక్కో ప్రశ్న చదివి అర్థం చేసుకోవడానికే 5నిమిషాలకు పైగా పట్టిందని అభ్యర్థులు పేర్కొన్నారు. రెండు మార్కుల సమాధానాన్ని కూడా 5 మార్కుల స్థాయిలో రాయాల్సి వచ్చిందని వివరించారు.
Updated Date - Oct 27 , 2024 | 04:42 AM