Gulf Workers: గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయండి..
ABN, Publish Date - Aug 03 , 2024 | 04:17 AM
గల్ఫ్, తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
సీఎంకు గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్, తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు జీవో విడుదల చేయాలని, ఎన్నారై పాలసీని తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం వారు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో రేవంత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు, మాజీ రాయబారి డాక్టర్ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - Aug 03 , 2024 | 04:17 AM