Hyderabad: నేను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్‌ను కాను : గుత్తా
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:34 AM
తాను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్‌ను కానని, ఈ పదవిని తీసుకున్న తర్వాత తనకు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తాను బీఆర్‌ఎస్ మండలి చైర్మన్‌ను కానని, ఈ పదవిని తీసుకున్న తర్వాత తనకు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే పట్నం మహేందర్‌రెడ్డినీ అధికారిక చీఫ్ విప్‌గానే చూడాలన్నారు. మహేందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలపై ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వారు.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలోనూ ఆ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఒక్కొక్కరుగా చేరిన తర్వాతనే విలీనం చేసుకున్నారన్నారు. తలసాని.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండీ ప్రభుత్వంలో మంతిగ్రా చేరలేదా అని గుర్తు చేశారు.
Updated Date - Oct 10 , 2024 | 04:34 AM