ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubnagar: ఒంటరి మహిళలే టార్గెట్‌..

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:56 AM

ఒంటరిగా ఉన్న మహిళలకు డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన హంతకుడిని మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ పోలీసులు పట్టుకున్నారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడు.

  • 3 వేలు అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రాణమూ తీశాడు

  • సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకున్న పోలీసులు

  • డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకుని హత్య

  • రెండేళ్లలో ఐదుగురు మహిళలను చంపిన కిరాతకుడు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 29 : ఒంటరిగా ఉన్న మహిళలకు డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన హంతకుడిని మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ పోలీసులు పట్టుకున్నారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడు. చేసిన అప్పు తీర్చమన్నందుకు ఓ పురుషుడిని కూడా ఆ కిరాతకుడు కడతేర్చాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ జానకి ధరావత్‌ వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన బోయ కాశమయ్య అలియాస్‌ బోయ కాశి(25) అవివాహితుడు. రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు వచ్చి కూలి పనులు చేస్తూ ఫుట్‌పాత్‌, బస్టాండ్‌ల్లో నిద్రిస్తూ కాలం గడిపేవాడు.


పని చేయగా వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సా చేసేవాడు. కూలీలు పని కోసం వేచి ఉండే అడ్డాల దగ్గర మాటువేసి ఒంటరి మహిళలతో మాటలు కలిపి డబ్బు ఆశ చూపి లోబర్చుకునేవాడు. నమ్మి వచ్చిన వారితో వాంఛ తీర్చుకున్న తర్వాత ప్రాణం తీసి పరారయ్యేవాడు. మే 25న టీడీగుట్ట లేబర్‌ అడ్డా దగ్గర మహబూబ్‌నగర్‌ మండలం గాజులపేటకు చెందిన ఓ మహిళకు డబ్బు ఇస్తానని నమ్మించి భూత్పూర్‌లోని అమిస్తాపూర్‌ వంతెన వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత ఆమె గొంతుకు టవల్‌ బిగించి, బ్లేడుతో గొంతుకోశాడు. అనంతరం బండరాయితో తలపై మోది ఆమె కాళ్లకున్న వెండి కడియాలు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి దుస్తులకు అతుక్కుని ఉన్న ఓ బస్‌ టికెట్‌పై రాసి ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేసి హత్యకు గురైంది ఎవరనేది గుర్తించారు.


ఆ క్రమంలో నిందితుడు కాశీని గుర్తించిన పోలీసులు టీడీగుట్ట వద్ద శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించిన కాశీ.. గతంలో తాను చేసిన హత్యల వివరాలను వెల్లడించాడు. 2022 జూన్‌ 22న బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ గేట్‌ దగ్గర ఓ గుర్తుతెలియని మహిళను హత్య చేసిన కాశీ 2022 నవంబరు 21న హన్వాడ పరిధిలో జైనల్లీపూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రాణం తీశాడు. 2023 జూన్‌ 17న వనపర్తి రూరల్‌లోని పెద్దగూడెం గ్రామంలో ఓ మహిళను, 2024 ఫిబ్రవరి 7న మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం పరిధిలోని మన్యంకొండ దగ్గర మరో మహిళను హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మున్నూర్‌ మల్లేష్‌ అనే సహచర కూలీ కాశీకి రూ.3వేలు అప్పు ఇచ్చి తీర్చమన్నందుకు 2023 జూలై 13న అమిస్తాపూర్‌ శివారులో తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

Updated Date - Jun 30 , 2024 | 04:56 AM

Advertising
Advertising