సర్కార్ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపం: హరీశ్‌రావు
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:21 AM
రాష్ట్రంలోని గురుకులాలపట్ల సర్కారు నిర్లక్ష్యం.. అక్కడి విద్యార్థులకు శాపంగా మారిందని, తాజాగా నలుగురు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురికావడం తనను కలచివేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గురుకులాలపట్ల సర్కారు నిర్లక్ష్యం.. అక్కడి విద్యార్థులకు శాపంగా మారిందని, తాజాగా నలుగురు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురికావడం తనను కలచివేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్‌పాయిజన్ కేసులు సర్వసాధారణమయ్యాయన్నారు. ఇప్పుడు మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్‌లో నలుగురు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురై గాయాలపాలు కావడం దురదృష్టకరమని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టింపు లేనితనం, దీనికి తోడు గురుకులాల్లోని సిబ్బంది నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు. విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 05:21 AM