Harish Rao: అంగన్వాడీలకు జీతాలివ్వరా..?: హరీశ్ రావు
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:54 AM
డిసెంబరు నెల ప్రారంభమై 14 రోజులు అవుతున్నా రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు ఇవ్వలేదని, దీంతో వారు ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
హైదరాబాద్/బంజారాహిల్స్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు నెల ప్రారంభమై 14 రోజులు అవుతున్నా రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు ఇవ్వలేదని, దీంతో వారు ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వెంటనే అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒకటో తేదీన అందరికి జీతాలు అని గప్పాలు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. 39,568 అంగన్వాడీల పరిస్థితి ఆయన దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో జీతాలు అందక నరకం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాఽధించిన ఘనత ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. కాగా, గిరిజన హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని హరీశ్ ఆరోపించారు. తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సరస్వతి అనే విద్యార్థినిని శనివారం ఆయన పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Dec 15 , 2024 | 03:54 AM