ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: పసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:07 AM

ఆహార పంటలకు బదులు పప్పుధాన్యాల సాగుతో లాభాలు సాధించాలన్న రైతుల ఆశలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అడియాశలు చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

  • రైతులు నష్టపోకుండా చూడాలి.. సీఎంకు హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆహార పంటలకు బదులు పప్పుధాన్యాల సాగుతో లాభాలు సాధించాలన్న రైతుల ఆశలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అడియాశలు చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో విఫలమయ్యారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.


పెసరకు కేంద్రం ప్రకటించిన రూ.8,682 మద్దతు ధరతో ఎవరూ కొనడంలేదని, దీంతో రైతులు క్వింటాలు పెసరను రూ.6,000 నుంచి రూ.6,500కు అమ్ముకొనే పరిస్థితి వచ్చిందన్నారు. ‘మీ పాలనలో పంటలు పండించడం, పంటలను విక్రయించడం రైతన్నకు కత్తిమీద సాముగా మారింద’న్నారు. ఇప్పటికైనా వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, మార్క్‌ఫెడ్‌ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలను అన్ని జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


కాగా, సీఎం రేవంత్‌ప్రాతినిధ్యం వహించే కొడంగల్‌ నియోజకవర్గంలోనే ఉపాధ్యాయుల్లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటని హరీశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉంటే ఎవరూ పట్టించుకోవడంలేదని, రాష్ట్రంలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉందన్నారు. తక్షణమే విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలలు మూతపడకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 29 , 2024 | 04:07 AM

Advertising
Advertising