ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం రేవంత్

ABN, Publish Date - Mar 26 , 2024 | 09:55 PM

ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవల్సిన అవసరం ఉందని చెప్పారు.

మెదక్ జిల్లా: ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక కావాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.

బీజేపీ నలుగురు ఎంపీలు ఏనాడు పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడలేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కులు కాపాడటం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేస్తే కాంగ్రెస్ దండగ చేస్తోందని ధ్వజమెత్తారు. పంటలు ఎండినా సీఎం రేవంత్‌కు పట్టడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.రేవంత్‌ది బూటకపు పాలన అని ఎద్దేవా చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌ను ముంచుడు ఖాయమన్నారు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం అంటారని.. రేవంత్ రెడ్డి కవిత అరెస్ట్‌ను సమంజసమని అంటున్నారని చెప్పారు. ఆదాని, అంబానీలు మోదీ దోస్తులన్నారు.

గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ గాంధీ చెబుతారని.. రేవంత్ రెడ్డి మాత్రం సూపర్ అంటున్నారని అన్నారు. బీజేపీతో కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ మంత్రి లేరని మండిపడ్డారు. బీజేపీతో దోస్తాన్ ఎవరో.. శత్రువు ఎవరో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ఓటేయాలని హరీశ్‌రావు అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 10:46 PM

Advertising
Advertising