ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Teja: ఆందోళనకరంగానే శ్రీతేజ ఆరోగ్యం

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:19 AM

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు.

  • 10రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స.. కిమ్స్‌ హెల్త్‌ బులెటిన్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. గత 10 రోజులుగా శ్రీతేజ వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ మేరకు శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. శ్రీతేజకు పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, ట్యూబ్‌ల ద్వారా ఆహారం అందిస్తున్నామని కిమ్స్‌ వైద్యులు చేతన్‌ ఆర్‌.ముందాడ, విష్ణు తేజ్‌లు వెల్లడించారు.


మెదడు పనితీరులో మెరుగుదల కనిపించడంలేదని, దీంతో బాలు డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నామన్నారు. రక్తపోటు, గుండె కొట్టుకోవడం, రక్తప్రసరణ సరిగానే ఉందని.. కానీ లోఫీవర్‌తో బాధపడుతున్నట్లు వివరించారు. కాగా, శ్రీతేజ శరీరంలో కొంతమేర కదలికలు కనిపిస్తున్నాయని.. అయి తే వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదని శ్రీతేజ బంధువులు చెప్పారు.

Updated Date - Dec 15 , 2024 | 04:19 AM