ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: దంచికొట్టిన వాన..

ABN, Publish Date - Sep 22 , 2024 | 04:01 AM

ఉరుము తీవ్రమే.. మెరుపూ తీవ్రమే! ఈ రెండింటినీ తలదన్నేలా వాన!! ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా భారీగా కురిస్తే వాన మొదలైన క్షణాల్లో వరద పోటెత్తింది.

  • హైదరాబాద్‌లో భారీ వర్షం

  • రోడ్లను ముంచేసిన వరద భారీ ఎత్తున ట్రాఫిక్‌జాం

  • లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి పోటెత్తిన నీళ్లు

  • మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, కవాడిగూడ, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ఉరుము తీవ్రమే.. మెరుపూ తీవ్రమే! ఈ రెండింటినీ తలదన్నేలా వాన!! ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా భారీగా కురిస్తే వాన మొదలైన క్షణాల్లో వరద పోటెత్తింది. పార్క్‌ చేసిన బైక్‌లు కొట్టుకుపోతాయేమో అన్నట్టుగా.. కార్లు సగం దాకా మునిగిపోయేలా వరద ఉధృతి కొనసాగింది. ఏది రోడ్డో... ఏది గుంతో.. ఏది కాలువో తెలియనంతగా ఎటు చూసినా వరద కుమ్మేసింది. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం వరుణుడి ప్రకోపమిది! గంటకుపైగా వర్షం దంచికొట్టింది. ప్రధాన రాహదార్లలో మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలదైతే మరీ దయనీయ స్థితి. బస్తీలు, కాలనీల్లోకే కాదు.. ఇళ్లలోకి వరద పోటెత్తింది.


ఖైరతాబాద్‌లోని ఎంస్‌మక్తా, బేగంపేట బ్రాహ్మిణివాడి, లంగర్‌హౌస్‌, యూసు్‌ఫగూడ శ్రీకృష్ణానగర్‌ బి-బ్లాక్‌, లక్ష్మీనర్సింహనగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాత్రి 9 గంటల వరకు లంగర్‌హౌ్‌సలో 9.1, ఖైరతాబాద్‌ గణాంకభవన్‌ వద్ద 8.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.. బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి ప్రధాన రహదారిలో కిలోమీటర్‌ ప్రయాణానికి గంటకుపైగా సమయం పట్టింది. రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవడంతో తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు రంగంలోకి దిగి వరదనీటిని తొలగించాయి. వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు నెలకొనడంతో చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాఫిక్‌ సమస్య నెలకొనడంతో ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది. ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, మహబూబాద్‌ జిల్లాల్లో వర్షం పడింది. పిడుగుపాటుకు ఆదిలాబాద్‌ జిల్లా బేలలో రాథోడ్‌ అవినాశ్‌ (22) యువ రైతు మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం దిగ్వాల్‌లో 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.


  • మరో నాలుగు రోజులు వర్షాలే..

రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 25 వరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా 23న వాయవ్య, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Sep 22 , 2024 | 06:22 AM