Cyclone: ఈనెల 12 వరకు భారీ వర్షాలు
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:24 AM
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే మంగళవారం కూడా ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బుధ, గురువారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Updated Date - Sep 09 , 2024 | 04:24 AM