TS News: కొమురం భీం జిల్లాలోని పలు గ్రామాలకు హై అలర్ట్..
ABN, Publish Date - Apr 05 , 2024 | 07:23 AM
ఏనుగు జాడ కోసం అటవీ శాఖ గాలింపు నిర్వహిస్తోంది. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగుతోందని తెలుసుకున్నారు. బెజ్జురు, చింతల మానే పల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కొమురం భీం : ఏనుగు (Elephant) జాడ కోసం అటవీ శాఖ గాలింపు నిర్వహిస్తోంది. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగుతోందని తెలుసుకున్నారు. బెజ్జురు, చింతల మానే పల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏనుగును బంధించాలని అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బంధించడం అసాధ్యమని, తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపిస్తామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ట్యాపింగ్‌తో పసిగట్టి.. స్టింగ్ ఆపరేషన్!
వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మోహన చంద్ర పర్గేన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మరణించడం బాధాకరమన్నారు. అసలు ఏనుగు ఈ ప్రాంతంలోకి వస్తుందని ఊహించలేదన్నారు. గతంలో ఎప్పుడూ తెలంగాణలోకి ఏనుగులు రాలేదన్నారు. వైల్డ్ ఏనుగు కదలికలను డ్రోన్‌ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, చత్తిస్ గడ్, తమిళనాడు అధికారుల సహాయం కోరామన్నారు. ఏనుగు వల్ల మళ్ళీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏనుగు మహారాష్ట్ర కు వెళ్లే వరకు సహకరించాలని ప్రజలను మోహన చంద్ర పర్గేన్ కోరారు.
జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు మండలాలైన చింతలమానేపల్లి, పెంచికలపేట, బెజ్జూరు తదితర మండలాల ప్రజలు బయటకు వెళ్లేందుకు జంక తున్నారు. ఏనుగు భీభత్సం సృష్టించి ఇద్దరు ప్రాణాలను బలి తీసుకోవడంతో జిల్లాలో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. గతంలో పులులు మనుషులపై దాడి చేసి హత మార్చిన సంఘటనలు చూశాం. కానీ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇద్దరి ప్రాణాలను ఏనుగు బలి తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్(56) అనే రైతును బుధవారం సాయంత్రం తొక్కి బలి తీసుకోగా, ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోశయ్య(57) వ్యవసాయ పనుల కోసం తన చేనుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడి చేసి హతమార్చింది.
ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 05 , 2024 | 07:24 AM