ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: హైడ్రా తీరు ఆందోళనకరం..

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:17 AM

హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 99పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

  • చట్టబద్ధత లోపించినట్టుంది జీహెచ్‌ఎంసీ అధికారాలు

  • ఎలా బదలాయిస్తారు?: హైకోర్టు

  • వివరాలు సమర్పించాలని సర్కారుకు ఆదేశం.. జీవోపై స్టేకు నిరాకరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 99పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. హైడ్రా ఏర్పాటు విషయంలో ఆ చట్టబద్ధత లోపించినట్లు కనబడుతోందని వ్యాఖ్యానించింది. ఎలాంటి చట్టం లేకుండా కేవలం జీవో ద్వారా ఏర్పడిన హైడ్రా పని విధానం ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడింది. చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీకి ఉన్న అధికారాలను హైడ్రాకు ఏవిధంగా బదలాయిస్తారని ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు, దాని విధులు, చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం అలియాపూర్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 119/21, 22 ఉన్న తమ నిర్మాణాలను కూలగొట్టడంపై డి.లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 చట్ట విరుద్థంగా ఉందని, దాన్ని కొట్టివేయాలని కోరారు. కేవలం నోడల్‌ ఏజెన్సీగా మాత్రమే ఉన్న హైడ్రా.. విశేషమైన అధికారాలు బదలాయించడం చెల్లదని తెలిపారు. ఎలాంటి నోటీసు లేకుండా పట్టా భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చడం అన్యాయమని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. హైడ్రా పనితీరును తప్పు పట్టింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత, ఏర్పాటు, విధులు తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్‌ కోరిన విధంగా హైడ్రా జీవోపై ప్రస్తుత దశలో స్టే ఇవ్వలేమని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పిటిషనర్‌ ఆస్తి విషయంలో టైటిల్‌, ఆధారాలు, అన్ని బిల్లులను పరిశీలించి చట్ట ప్రకారం నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 19 కి వాయిదా వేసింది.

Updated Date - Sep 14 , 2024 | 04:17 AM

Advertising
Advertising