ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:06 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్‌ డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • బెయిల్‌ పిటిషన్‌పై వివరణ ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఐదో నిందితుడు రిటైర్డ్‌ డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ప్రభుత్వం వివరణ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాను రిటైర్డ్‌ పోలీసు అధికారినని.. సీనియర్‌ సిటిజన్‌ను అని.. కేసుతో ఎలాంటి సంబంధం లేదని తనకు బెయిల్‌ ఇవ్వాలని పేర్కొంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దిగువ కోర్టు తాను దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లను కొట్టేయడం చెల్లదని పేర్కొన్నారు. ఇతర నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తనను అరెస్ట్‌ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం.. పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.


  • అధికారులకు రాజకీయాలతో పనేంటి: హైకోర్టు

అధికారులకు రాజకీయాలతో పనేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల్లో అధికారులు కూడా పోటీ చేస్తున్నారా? ఎన్నికలకు అప్పీలు దాఖలుకు సంబంధం లేదని పేర్కొంది. హైదరాబాద్‌ ఆసి్‌ఫనగర్‌ మండలం గుడిమల్కాపూర్‌లోని ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఆలస్యంగా అప్పీలు దాఖలు చేయడంపై అసహనం వ్యక్తంచేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా? ఎన్నికల వల్ల ఆలస్యం అయిందని చెప్పడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది.

Updated Date - Oct 19 , 2024 | 05:06 AM