High Court: ఎమ్మెల్యే లేకుండా చెక్కుల పంపిణీ వద్దు
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:32 AM
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందజేసే ఎలాంటి చెక్కులైనా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేకుండా పంపిణీ చేయొద్దని, ఎమ్మెల్యే లేకుండా నిర్వహించే అన్ని చెక్కుల పంపిణీ కార్యక్రమాలను ఈనెల 23 వరకు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది.
మేడ్చల్ జిల్లా యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందజేసే ఎలాంటి చెక్కులైనా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేకుండా పంపిణీ చేయొద్దని, ఎమ్మెల్యే లేకుండా నిర్వహించే అన్ని చెక్కుల పంపిణీ కార్యక్రమాలను ఈనెల 23 వరకు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మేడ్చల్ కలెక్టర్, కూకట్‌పల్లి ఆర్డీవో, స్థానిక తహసీల్దార్‌కు జస్టిస్ మాధవీ దేవి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బండి రమేశ్‌తో అధికారులు చెక్కులు పంపిణీ చేయిస్తున్నారని, ప్రజలు ఎన్నుకున్న తనను పక్కనపెట్టడం అక్రమమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం... ఈనెల 23 వరకు చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 23కు వాయిదా వేసింది.
Updated Date - Dec 19 , 2024 | 05:32 AM