ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఎఫ్‌టీఎల్‌ తాఖీదులను.. షోకాజ్‌ నోటీసులుగా పరిగణించాలి

ABN, Publish Date - Aug 30 , 2024 | 03:23 AM

ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌(ఎ్‌ఫటీఎల్‌) విషయంలో తహసీల్దార్‌ వాల్టా చట్టం కింద ఇచ్చిన తాఖీదులను షోకాజ్‌ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

  • పిటిషనర్ల వాదనలను తహసీల్దార్‌ వినాలి

  • అన్ని పత్రాలను పరిశీలించాలి

  • కావూరీహిల్స్‌ పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌(ఎ్‌ఫటీఎల్‌) విషయంలో తహసీల్దార్‌ వాల్టా చట్టం కింద ఇచ్చిన తాఖీదులను షోకాజ్‌ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో అక్రమంగా ఇళ్లను నిర్మించారంటూ కావూరీహిల్స్‌ వాసులకు ఈ నెల 3న శేరిలింగంపల్లి తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..! సేల్‌డీడ్స్‌, ఇతర అనుమతి పత్రాలతో రెండు వారాల్లో నోటీసులకు సమాధానాలివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


దీన్ని సవాలు చేస్తూ కావూరీహిల్స్‌ వాసులు-- మాడిశెట్టి మురళీధర్‌రావు సహా.. ఏడుగురు వ్యక్తులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. తొలుత జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. ఇప్పటికే దుర్గం చెరువుకు సంబంధించి ప్రజాహిత వ్యాజ్యాల(పిల్స్‌)ను వింటున్న చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావుల ధర్మాసనానికి బదిలీ చేశారు.


పిటిషనర్ల తరఫున బొమ్మినేని భరత్‌రెడ్డి వాదనలను వినిపిస్తూ.. 58 ఎకరాల్లో 280 ప్లాట్లతో అన్ని అనుమతులు పొందిన లేఅవుట్‌లో తన క్లైంట్లు 1998లో ప్లాట్లను కొనుగోలు చేసినట్లు కోర్టుకు వివరించారు. ఇన్నేళ్ల తర్వాత దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు ఉన్నాయని.. 30 రోజుల్లో తొలగించాలని నోటీసు ఇవ్వడం అక్రమమని పేర్కొన్నారు. కనీసం తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను చూడకుండా, ఎలాంటి వాదనలను వినకుండా ఏకపక్షంగా నోటీసులు ఇచ్చారని వివరించారు.


వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 3న తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులను షోకాజ్‌ నోటీసులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. తహసీల్దార్‌ పిటిషనర్ల వాదనలను విని, నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కేసు మెరిట్‌పై తాము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదని పేర్కొంటూ.. పిటిషన్లను ముగించింది. కాగా.. దుర్గం చెరువు కాలుష్యానికి సంబంధించిన పిల్‌పై కంప్లెయిన్స్‌ నివేదిను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

Updated Date - Aug 30 , 2024 | 03:23 AM

Advertising
Advertising