ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిందువులంతా ఏకమై ఉద్యమించాలి

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:37 AM

బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా పోరాటం చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ మతోన్మాదశక్తులు మైనార్టీ ప్రజలైన హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం దారుణమన్నారు.

  • బంగ్లాలో హిందువులపై నరమేధాన్ని ఆపాలి

  • స్వామి చిన్మయి కృష్ణదా్‌సను విడుదల చేయాలి

  • సంఘీభావ సభలో పలువురు వక్తల డిమాండ్‌

కవాడిగూడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా పోరాటం చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్‌ మతోన్మాదశక్తులు మైనార్టీ ప్రజలైన హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం దారుణమన్నారు. దా డులను నిరోధించడంలో అక్కడి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాం డ్‌ చేస్తూ బుధవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు ఉన్న హిందూ ఐక్యవేదిక నాయకులు, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, ఆర్‌ఎ్‌సఎస్‌ నేతలు, వివిధ పీఠాల స్వామీజీలు హాజరై మద్దతు ప్రకటించారు.


ఈ సందర్బంగా చినజీయర్‌ స్వామి ఆశ్రమ ఉత్తారాధికారి దేవనాధ జీయర్‌ స్వామి మాట్లాడుతూ... హిందువులు, ఇతర మైనార్టీ వర్గాల రక్షణ కోసం బంగ్లా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వెంటనే ఇస్కాన్‌ స్వామిజీ చిన్మయి కృష్ణదా్‌సను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రపంచ వేదికలపై బంగ్లాదేశ్‌ను దోషిని నిలబెడతామని హెచ్చరించారు. ప్రపంచంలో భారత్‌ ఒక్కటే సెక్యులర్‌ దేశమన్నారు. హిందువుల సహనాన్ని చేతకాని తనంగా తీసుకొని దాడులు చేస్తామంటే ప్రతిదాడులు తప్పవన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ జాతీయ కమిటీ సభ్యులు బాగయ్య మాట్లాడుతూ... బంగ్లాదేశ్‌ ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగమేనని, అక్కడ హిందువులపై నరమేధం జరగడం దారుణమన్నారు. అంతర్జాతీయస్దాయిలో ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హిందువుల రక్షణ కోసం కృషి చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Dec 05 , 2024 | 04:37 AM