HMDA: రెవెన్యూ, ఇరిగేషన్ ఓకే అన్నాకే!
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:39 AM
హెచ్‌ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను తొలుత రెవెన్యూ, సాగునీటి శాఖలు పరిశీలించి ఓకే అన్నాకే..
బిల్డింగ్, లేఅవుట్ అనుమతుల్లో మార్పు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను తొలుత రెవెన్యూ, సాగునీటి శాఖలు పరిశీలించి ఓకే అన్నాకే.. అనుమతి ఇవ్వాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో ఉన్న రెవెన్యూ అధికారులే క్లియర్ టైటిల్ ఉందా? అనే విషయాలను పరిశీలించి ఫైల్‌ను ఓకే చేసి ముందుకు నడుపుతున్నారు. తర్వాతే ప్లానింగ్ విభాగం నుంచి ప్రాసెసింగ్ మొదలవుతోంది.
హెచ్‌ఎండీఏ అనుమతులతో నిర్మించిన ఒక భవనాన్ని ఇటీవల చెరువులో ఉందని హైడ్రా కూల్చేసింది. డెవలపర్ ఒక చోట స్థలం చూపించి, అనుమతులన్నీ పొందాక మరోచోట నిర్మాణం చేసినట్లు తేలింది. దాంతో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో స్థానికంగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు వస్తుందో అక్కడి రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐ, ఇరిగేషన్ శాఖ ఏఈ క్లియరెన్స్ ఇవ్వాలని నిర్దేశించారు.
Updated Date - Oct 26 , 2024 | 03:39 AM