Hyderabad: కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:57 AM
నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.
- అరకొరగా మెట్రో లోకల్ కనెక్టివిటీ
- ఆచరణలో కనిపించని ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ విధానం
- నామమాత్రంగా ఆర్టీసీ ఫీడర్ సర్వీసులు
- అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రయాణికులు
హైదరాబాద్ సిటీ: నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే. అయితే మెట్రో స్టేషన్ల నుంచి తమ ప్రాంతాలకు రవాణా కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలు వెచ్చించి బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు(Bikes, autos, cabs) బుక్ చేసుకుని వెళ్తున్నారు. మెట్రోకు అనుసంధానంగా ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తామని, స్టేషన్ల నుంచి తక్కువ చార్జీతోనే రవాణా సౌకర్యం కల్పిస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కిడ్నాప్ చేసి నదిలో పడేశారు..
ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇలా..
నగర ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు నాలుగేళ్ల క్రితం అధికారులు ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మేరకు ఉదయం ఇంటి సమీపంలోని మెట్రో స్టేషన్‌కు సులువుగా వెళ్లడం, తిరిగి రాత్రి సమయంలో తక్కువ చార్జీతో ఇంటికి చేరుకునే విధంగా ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. దీంతోపాటు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కింద రాత్రి 9 లోపు ప్రధాన స్టేషన్లలో మెట్రో దిగిన ప్యాసింజర్ల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం తొలుత ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించారు.
అయితే స్టేషన్ల నుంచి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే రవాణా సేవలందించాల్సి ఉండడంతో.. రేటు గిట్టుబాటు కాదని అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. రెండేళ్ల క్రితం మెట్రో రైడ్ సంస్థ ముందుకొచ్చినప్పటికీ కేవలం ఐటీ సంస్థలు అధికంగా ఉండే హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల వద్దనే ఎలక్ర్టిక్ ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచింది. మిగతా చోట్ల ఈ కనెక్టివిటీ లేకపోవడంతో ఆయా స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు వందలాది రూపాయలతో ఆటోలు, క్యాబ్‌లు బుక్‌చేసుకుని ఇళ్లు, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. అదే ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటే నాలుగు కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.
కొన్ని స్టేషన్ల వద్దే ఆర్టీసీ సేవలు..
మూడు మెట్రో కారిడార్ల పరిధిలో మొత్తం 57 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతం 15 చోట్ల మాత్రమే ఫీడర్ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఫీడర్ సర్వీసుల సేవలను గుర్తించిన మెట్రో రైలు అధికారులు గతంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి మెట్రో స్టేషన్‌కు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీలను ఫీడర్ సేవల ద్వారా అనుసంధానం చేయొచ్చు. అయితే చిన్న బస్సులు అందుబాటులో లేవంటూ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్‌కాలనీ, వెంగళరావునగర్ కాలనీలను ఫీడర్ సర్వీసుల ద్వారా యూసుఫ్‌గూడ మెట్రోస్టేషన్‌కు.. గచ్చిబౌలి, కొండాపూర్, జేఎన్‌టీయూ, హఫీజ్‌పేట ప్రాంతాలను హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల
ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!
ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 08 , 2024 | 09:58 AM