ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suryapet: ఆడపిల్ల వద్దంటూ.. ఏడో నెలలో అబార్షన్‌..

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:58 AM

భార్య కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించేందుకు సిద్ధపడ్డాడా భర్త! ఏడో నెలలో అబార్షన్‌ చేస్తే తల్లిప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా అతడి మనసు మారలేదు! తెలిసిన ఆర్‌ఎంపీ సాయంతో.. ఓ వైద్యుణ్ని సంప్రదించి.. అతడి మామిడితోటలో దొంగచాటుగా అబార్షన్‌ చేయించాడు.

  • తల్లి ప్రాణానికే ముప్పని వైద్యులు చెప్పినా వినని భర్త

  • ఆర్‌ఎంపీ సహాయంతో భార్యకు

  • మామిడితోటలో గర్భస్రావం చేయించి ఆమె ప్రాణాలు బలిగొన్న వైనం

  • సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో విషాద ఘటన

హుజూర్‌నగర్‌ / సూర్యాపేట క్రైం, జూన్‌ 27: భార్య కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించేందుకు సిద్ధపడ్డాడా భర్త! ఏడో నెలలో అబార్షన్‌ చేస్తే తల్లిప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా అతడి మనసు మారలేదు! తెలిసిన ఆర్‌ఎంపీ సాయంతో.. ఓ వైద్యుణ్ని సంప్రదించి.. అతడి మామిడితోటలో దొంగచాటుగా అబార్షన్‌ చేయించాడు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయిందా అభాగ్యురాలు!! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిందీ విషాదం. తమకు తెలియకుండా తమ కుమార్తెకు అల్లుడు ఆపరేషన్‌ చేయించడాన్ని ఆగ్రహిస్తూ తల్లిదండ్రులు గురువారం సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.


మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారం గ్రామపంచాయతీ ఆవాసం రాముతండాకు చెందిన సుహాసిని(26)కి చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్‌ హరిసింగ్‌తో ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరిసింగ్‌ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర కిందట సుహాసిని గర్భవతి కాగా.. లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ చేయించాడు. ఇటీవల ఆమె మరోసారి గర్భం దాల్చడంతో మళ్లీ స్కానింగ్‌ తీయించాడు. కడుపులో ఉన్నది ఆడశిశువు అని నిర్ధారణ కావడంతో మరోసారి అబార్షన్‌ చేయించేందుకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యురాలు.. ఏడు నెలల గర్భం ఉన్న పరిస్థితుల్లో అబార్షన్‌ చేయడం వీలుపడదన్నారు. అయినప్పటికీ హరిసింగ్‌ ఊరుకోలేదు.


ఓ ఆర్‌ఎంపీ సహాయంతో భార్య సుహాసినిని తీసుకుని హుజూర్‌నగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. ఆమెకు అబార్షన్‌ చేసేందుకు ఓ వైద్యుడిని ఒప్పించారు. హుజూర్‌నగర్‌ పట్టణ సమీపంలో.. ఆ వైద్యుడికి చెందిన మామిడి తోటలో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌లో ఈ నెల 25వ తేదీన రాత్రిపూట సుహాసినికి అబార్షన్‌ చేస్తుండగా తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమిస్తుండటంతో ఆమెను తొలుత కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు పరిస్థితి బాగాలేదని చెప్పడంతో.. ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడినుంచి తిరిగి సూర్యాపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపకుండా అదే రోజు మృతదేహాన్ని ఎంజీనగర్‌తండాకు తీసుకెళ్లాడామె భర్త.


కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..

సుహాసిని మృతి విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎంజీనగర్‌తండాకు వెళ్లారు. తమకు తెలియకుండా తమ కుమార్తెకు ఎలా ఆపరేషన్‌ చేయిస్తావంటూ అల్లుడితో గొడవపడ్డారు. ఆపరేషన్‌ చేసిన వైద్యుడిని నిలదీసేందుకు సుహాసిని తల్లిదండ్రులు, బంధువులు హుజూర్‌నగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యుడు లేకపోవడంతో సిబ్బందితో గొడవపడ్డారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సూర్యాపేట పట్టణానికి వచ్చి స్థానిక ఏరియా ఆసుపత్రిలో సుహాసిని మృతదేహాన్ని ఉంచారు. అనంతరం.. సుహాసిని భర్తపైన, ఆపరేషన్‌ చేసిన వైద్యుడిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తే టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారి ఫిర్యాదు తీసుకుని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత.. చట్టవిరుద్ధంగా అబార్షన్‌ చేసిన హుజూర్‌నగర్‌ వైద్యుడితోపాటు, ముగ్గురు ఆర్‌ఎంపీలు, ఆసుపత్రి అటెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jun 28 , 2024 | 04:58 AM

Advertising
Advertising