HYD : చిన్నబోయిన పెద్ద చెరువు!
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:43 AM
గగన్‌పహాడ్ మొదలు.. ప్రేమావతిపేట్ వరకు 97.26 ఎకరాల్లో విస్తరించిన పెద్ద చెరువు ఇప్పుడు చిన్నబోయిందా? 30 ఎకరాల దాకా చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొచ్చాయా?
ద ప్రెస్టీజ్ నిర్మాణ సంస్థ 30 ఎకరాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గగన్‌పహాడ్ మొదలు.. ప్రేమావతిపేట్ వరకు 97.26 ఎకరాల్లో విస్తరించిన పెద్ద చెరువు ఇప్పుడు చిన్నబోయిందా? 30 ఎకరాల దాకా చెరువులోకి అక్రమ నిర్మాణాలు చొచ్చుకొచ్చాయా? ద ప్రెస్టీజ్ సిటీ పేరుతో నిర్మాణాలు చేపడుతున్న సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడిందా? ఈ ప్రశ్నలకు స్థానికులు కొందరు అవునని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో), హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. 2017 నుంచి ఇప్పటి వరకు పెద్ద చెరువు కుంచించుకుపోతున్న తీరుపై గూగుల్‌ఎర్త్ ఉపగ్రహ చిత్రాల మ్యాప్‌లను తమ ఫిర్యాదులకు జత చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని, ఆక్రమణలు నిజమని నిర్ధారణ అయితే.. చర్యలు తప్పవని హైడ్రా అధికారులు చెబుతున్నారు. పెద్ద చెరువుగా పేరున్న మాల్గుడ్ చెరువు.. రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ గ్రామ పరిధిలోని 81 నుంచి 89 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 97.26 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి.
Updated Date - Sep 02 , 2024 | 04:43 AM