Hyderabad: 10 బస్‌డిపోలు..1000 కోట్లు.. ఎలక్ట్రిక్ బస్‌డిపోల ఏర్పాటుకు ఆర్టీసీ కసరత్తు
ABN, Publish Date - Oct 17 , 2024 | 09:48 AM
పర్యావరణానికి మేలు చేయడంతోపాటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ గ్రేటర్(RTC Greater) పరిధిలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
- భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళిక
- స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక
- గ్రేటర్‌లో 2400 ఎలక్ర్టిక్ బస్సులను తిప్పే లక్ష్యం
హైదరాబాద్ సిటీ: పర్యావరణానికి మేలు చేయడంతోపాటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ గ్రేటర్(RTC Greater) పరిధిలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. రాబోయే రెండేళ్లలో 2,400 ఎలక్ర్టిక్ బస్సులను రోడ్లపై ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పరిధిలో ఒక్కో డిపోను రూ.100 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా 10 ఎలక్ర్టిక్ బస్‌డిపోలను ఏర్పాటు చేయనుంది. కోకాపేట, ఐటీ కారిడార్(Kokapet, IT Corridor) వంటి ప్రాంతాల్లో ఎలక్ర్టిక్ బస్‌డిపోల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గ్రేటర్ కాంగ్రెస్‌లో గడబిడ..
గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ మొత్తం 2,800 బస్సులు నడుపుతుండగా వాటిలో 40 పుష్పక్‌బస్సులతో కలిపి 115 ఎలక్ర్టిక్ బస్సులు ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి 500, 2025లో 1900 ఎలక్ర్టిక్ బస్సులు అవుటర్ లోపల అందుబాటులోకి తెచ్చే యత్నాలు చేస్తోంది. డీజిల్ బస్సులను క్రమంగా తగ్గిస్తూ వాటి స్థానంలో ఎలక్ర్టిక్ బస్సులను తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నూతన ఎలక్ర్టిక్ బస్‌డిపోల ఏర్పాటు కోసం పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు.
జిల్లాలకు ఎలక్ర్టిక్ సూపర్ లగ్జరీ బస్సులు
నగరం నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు సూపర్ లగ్జరీ ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 35 బస్సులను ప్రారంభించగా, ఇదే తరహాలో ప్రతి జిల్లాకు నగరం నుంచి ఎలక్ర్టిక్ సూపర్ లగ్జరీ(Electric super luxury) బస్సులను తిప్పనున్న నేపథ్యంలో ఎలక్ర్టిక్ చార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ నెలకొననుంది. ఒక్కో ఎలక్ర్టిక్ బస్‌డిపోలో 80-100 బస్సులకు ఒకేసారి చార్జింగ్ పెట్టేలా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లో ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, హెచ్‌సీయూ, ముషీరాబాద్, హయత్‌నగర్ డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్ అధికారాల బదిలీ
ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!
ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 17 , 2024 | 09:48 AM