Hyderabad: 30 ఏళ్లు.. రూ.30.01 లక్షలు
ABN, Publish Date - Sep 18 , 2024 | 10:48 AM
బాలాపూర్ గణపతి లడ్డూ(Balapur Ganapati Ladoo) వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో ఉత్సవాలు ప్రారంభం కాగా, వేలం మాత్రం 1994లో మొదలైంది.
- బాలాపూర్ లడ్డూ ప్రత్యేకత..
- 15ఏళ్లుగా హనీఫుడ్స్ తయారీ
హైదరాబాద్ సిటీ: బాలాపూర్ గణపతి లడ్డూ(Balapur Ganapati Ladoo) వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో ఉత్సవాలు ప్రారంభం కాగా, వేలం మాత్రం 1994లో మొదలైంది. ఆ ఏడాది తొలిసారి 450 రూపాయల కు కొలను మోహన్‌రెడ్డి లడ్డూను కైవసం చేసుకొని దాన్ని తన పొలంలో చల్లారు. ఆర్థికంగా బాగా కలిసివచ్చిందన్న నమ్మకంతో తర్వాత సంవత్సరం ఆయనే వేలం ద్వారా రూ.4,500కు దక్కించుకొన్నారు. అలా ఏటా పెరుగుతూ 2002లో మొదటిసారి లక్షరూపాయలు దాటింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం అందరి దృష్టిని ఆకర్షించింది. 2008లో రూ.5లక్షలు, 2015లో రూ.10 లక్షలు, 2017లో రూ.15లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.25.60 లక్షలు పలికింది. కరోనా కారణంగా 2020లో మాత్రమే వేలం నిర్వహించలేదు. వేలం ద్వారా వచ్చే సొమ్మును గ్రామాభివృద్ధితో పాటు ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నట్టు బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..
కాగా, మంగళవారం ఉదయం బాలాపూర్ బొడ్రాయి దగ్గర ఉత్సవ సమితి ప్రతినిధి వంగేటి లక్ష్మారెడ్డి రూ.1,116తో వేలంపాట ప్రారంభించారు. 5 నిమిషాలకే రూ.30 లక్షలకు చేరింది. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో బీజేపీ నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి రూ.30.01 లక్షలకు లడ్డూను సొంతం చేసుకొన్నారు. శంకర్‌రెడ్డిని నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డూను అందజేశారు. లడ్డూ దక్కించుకున్న అనంతరం కొలను శంకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిమాన్విత లడ్డూ ప్రసాదాన్ని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి అందజేస్తానని, బంధుమిత్రులకూ పంచుతానని తెలిపారు.
............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................................
Hyderabad: రమ్మన్నారు.. వచ్చాక పట్టించుకోలేదు..
- సమరయోధుల కుటుంబాలకు పలకరింపు కరువు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానం(Secunderabad Parade Ground)లో నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో తమకు అవమానం జరిగిందని కొందరు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అవమానపడ్డామని, ఒక్కరు కూడా తమను పట్టించుకోలేదని వాపోయారు. పద్మశ్రీ అవార్డుల ప్రదానం సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారని అన్నారు. ‘ఉదయం 6 గంటలకు వచ్చినం. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నం. ఎవరు తమను కనీసం పలకరించలేదు’ అని పలువురు పేర్కొన్నారు.
పిలిస్తే వచ్చినం.. వెళ్లిపోతున్నాం
భర్త నాగేశ్వర్‌రావు స్వాతంత్య్ర సమరయోధుడు. కుటుంబాన్ని పక్కనబెట్టి దేశం, రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి ఆహ్వానం రావడంతో ఎంతో ఇబ్బందిపడి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక పలకరించే వారే కరువయ్యారు. రమ్మంటే వచ్చాం..కనీసం మమ్ముల్ని పట్టించుకోలేదు.
- కనపర్తి ధనలక్ష్మి, మిర్యాలగూడ
గౌరవం లేకుండా పోయింది
పిలిస్తే వచ్చాం. చూశాం వెళుతున్నాం. పలకరించేవారు కరువయ్యారు. ఇలా అవమానపర్చడం ఆవేదనగా ఉంది. కనీసం సన్మానం చేయకుండా పంపించారు. నాయకులెవ్వరూ తమ వైపే చూడలేదు.
- నర్సమ్మ, సూర్యాపేట
ఇదికూడా చదవండి: తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి
ఇదికూడా చదవండి: ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు
ఇదికూడా చదవండి: రాసిపెట్టుకో.. రాజీవ్ విగ్రహం తొలగిస్తాం
Read LatestTelangana News andNational News
Updated Date - Sep 18 , 2024 | 10:48 AM