ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 5 నిమిషాల ప్రయాణానికి 1/2 గంట...

ABN, Publish Date - Jul 16 , 2024 | 10:19 AM

వానొస్తే.. హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతాయి. అయితే, ఐటీ కారిడార్‌(IT Corridor)లో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి.

- చినుకు పడితే ఐటీ కారిడార్‌లో కదలని వాహనం

- వానొచ్చిన ప్రతిసారి ఇదేతంతు

- రోడ్లపైకి రావాలంటేనే వణుకు

- నిత్యం 5లక్షల నుంచి 6లక్షల వాహనాల రాకపోకలు

- రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ఇబ్బందులు

హైదరాబాద్: వానొస్తే.. హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతాయి. అయితే, ఐటీ కారిడార్‌(IT Corridor)లో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. కార్యాలయాలకు వెళ్లే సమయంలో.. వచ్చే సమయంలో వర్షం పడిందంటే వాహనదారులకు నరకమే. 5 నిమిషాల ప్రయాణానికి ఒక్కోసారి అరగంట పైనే పడుతుంది. వర్షం పడిందంటే చాలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ అష్టదిగ్బంధనంగా మారుతుంది.

ఇదికూడా చదవండి: Cybercriminals: వామ్మో.. వర్క్‌ ఫ్రం హోం పేరిట రూ.6 లక్షలు లూటీ చేసేశారుగా..


ముందుకు కదలని ట్రాఫిక్‌తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఐకియా సర్కిల్‌లో సైబర్‌ టవర్స్‌ నుంచి మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌ వరకు భారీస్థాయిలో ట్రాఫిక్‌ జామ్‌ అవతుంది.రోజూ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వాహనాలు రాకపోకలు సాగించే ఈ కారిడార్‌లో చినుకుపడ్డప్పుడు రోడ్డెక్కాలంటేనే హడలిపోతున్నారు. ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న వాహనాలతో పాటుగా రోడ్ల విస్తరణ జరగక పోవడం సమస్యగా మారింది. ఉన్న రోడ్లపైనే ఫ్లైఓవర్‌ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, చిరు వ్యాపారాలు, వాణిజ్య సముదాయాల అక్రమ పార్కింగ్‌లతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మాదాపూర్‌(Madapur)కే పరిమితమైన ఐటీ కారిడార్‌ ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీనికి తోడు ఐటీ కారిడార్‌ జోన్‌లలో అనేక చోట్ల రోడ్ల విస్తరణ, కల్వర్ట్‌ల నిర్మాణం, మంజీర, డ్రైనేజీ పైప్‌లైన్‌ల నిర్మాణం బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తాలో ఏడాదికాలంగా కొనసాగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణాలు వాహనదారులకు ఆటంకాలుగా మారుతున్నాయి. కొన్నిచోట్ల సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా మొరాయిస్తుండడం, ఇవి మరమ్మతులకు నోచుకోకపోవడం కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతున్నాయి. ప్రధానంగా లింగంపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద వర్షం వస్తే మునిగిపోయి లింగంపల్లి ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతున్నది.


రోడ్డుపై పార్కింగ్‌లతో ఇక్కట్లు..

బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తాలో ఏడాదికాలంగా కొనసాగుతున్న ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనుల జాప్యం వల్ల ఓల్డ్‌ మంబాయి రోడ్డు, పటాన్‌చెరు, మియాపూర్‌కు వెళ్లే వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. 5నిమిషాలు పట్టే ప్రయాణం అరగంట పడుతోంది. కొండాపూర్‌ కొత్తగూడ ఫ్లై ఓవర్‌కు రెండు వైపులా ఉన్న ప్రధాన ఆస్పత్రులు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల వాహనాల పార్కింగ్‌తో ఇక్కట్లు రెట్టింపయ్యాయి. ఈ ప్రాంతాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలంటే గంట సమయం వెచ్చించాల్సి వస్తోంది. గచ్చిబౌలి చౌరస్తాను బొటానికల్‌ గార్డెన్‌కు వచ్చే ప్రధాన రహదారిలో రోడ్ల డైవర్షన్‌ ఏర్పాటు చేయడంలో చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.


పరిష్కారం చూపాలి

మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ సర్వీ్‌సరోడ్డుపై ఏర్పాటు చేసిన వందలాది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు వచ్చే ఐటీ ఉద్యోగులు, కార్మికుల వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఇవే కాక ప్రధాన రోడ్లపై రాత్రిపూట ప్రైవేటు వాహనాలను, ప్రైవేట్‌ బస్సులను అక్రమ పార్కింగ్‌ చేస్తుండడం వల్ల కూడా సాఫీగా సాగే ట్రాఫిక్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఐటీ కారిడార్‌ పరిధిలో ఉన్న నాలుగు ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపగలిగితే సాఫీగా ముందుకు సాగే అవకాశాలుంటాయి.


ముసురేసిన నగరం

నగరంలో పలు ప్రాంతాలను సోమవారం ముసురు కమ్మేసింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, రాంచంద్రాపురం, హయత్‌నగర్‌, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, గాజులరామారంతో పాటు గ్రేటర్‌ వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అడ్డగుట్టలో అత్యధికంగా 10.8 సెం.మీ, యూసు్‌ఫగూడలో 9.4, న్యూ మెట్టుగూడలో 8.4 సెం.మీ వర్షపాతం నమోదయింది. మరో రెండురోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 10:19 AM

Advertising
Advertising
<