Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి 80 ప్రత్యేక బస్సులు
ABN, Publish Date - Jul 07 , 2024 | 10:29 AM
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కల్యాణోత్సవం నేపథ్యంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) 80 ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
- ఈనెల 8 నుంచి 10 వరకు స్పెషల్ ఆపరేషన్స్
- 18 పాయింట్ల నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు బస్సులు
హైదరాబాద్ సిటీ: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కల్యాణోత్సవం నేపథ్యంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) 80 ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు రోజుల పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్, సీబీఎస్, సికింద్రాబాద్(MGBS, CBS, Secunderabad), ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, మెహిదీపట్నం, కాచిగూడ రైల్వేస్టేషన్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఉప్పల్ ఎక్స్‌రోడ్, మియాపూర్ ఎక్స్‌రోడ్, రాంనగర్, మల్కాజిగిరితో పాటు మొత్తం 18 పాయింట్ల నుంచి ఎస్‌ఆర్ నగర్ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. బల్కంపేట అమ్మవారి కల్యాణోత్సవానికి గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారని రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మాదాపూర్‌లో 7.8 మి.మీ వర్షం..
ప్రయాణికుల కోసం రేతిఫైల్ బస్‌స్టేషన్ (9959226154), కోఠి (9959226160) ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని బస్సు ల వివరాలకు ఈ ఫోన్ నంబర్లలో వివరాలు తెలుసుకోవచ్చన్నారు. స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహణకు నలుగురు అధికారులను ఆర్టీసీ ప్రత్యేకంగా నియమించింది. బల్కంపేట దేవాలయం కూకట్‌పల్లి డీఎం (9959226151), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రాణిగంజ్ డీఎం (9959226147), జేబీఎస్ కంటోన్మెంట్ డీఎం- (9959226143), ఎంజీబీఎస్ ముషీరాబాద్ డీఎం (9959226418) నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
బోనాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
బోనాల నేపథ్యంలో గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో విద్యుత్‌శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌జోన్ పరిధిలోని ప్రముఖ దేవాలయాల వద్ద 854 వరకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. ముఖ్య ప్రాంతాల్లో అదనంగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచినట్లు విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఒక్కో దేవాలయం వద్ద ఒక్కో అధికారి, సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించినట్లు మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ నర్సింహస్వామి, రంగారెడ్డి జోన్ సీఈ పి.ఆనంద్, మేడ్చల్ జోన్ సీఈ సాయిబాబా తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా అన్ని రకాల చర్య లు చేపట్టడంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 07 , 2024 | 10:29 AM