ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. రాష్ట్ర బడ్జెట్‌పై నగరవాసుల స్పందన

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:29 AM

రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌ గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను వివిధ విభాగాలకు కేటాయించింది. అయితే బడ్జెట్‌లో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా జనరంజకంగా ఉందని అధికార పక్షం వాదిస్తోంది.

- రాష్ట్ర బడ్జెట్‌పై నగరవాసుల స్పందన

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌ గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను వివిధ విభాగాలకు కేటాయించింది. అయితే బడ్జెట్‌లో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా జనరంజకంగా ఉందని అధికార పక్షం వాదిస్తోంది. కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బడ్జెట్‌ గురించి నగరవాసులు ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: రేవ్‌పార్టీలో డ్రగ్స్‌, విదేశీ మద్యం..


అంకెల గారడీగా రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క(Finance Minister Bhatti Vikramarka) గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. ఆదాయం, వ్యయం, అప్పు ప్రస్తావనలు తెలుపకుండానే రసవత్తర బడ్జెట్‌గా భట్టి చెప్పుకొచ్చారు. పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల ఊసేలేకుండా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలకు ఇస్తానన్న రూ.2,500 హామీ నెరవేరుస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేవలం రూ.10 వేల కోట్లను కేటాయించడం దురదృష్టకరం. విద్య, వైద్య రంగాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండగా ఈ రంగాలకు నామ మాత్రం నిధులను కేటాయించి చేతులు దులుపుకున్నారు. తాను భట్టికి ఆర్థికశాస్త్రం పాఠాలను బోధించాను. ఈ బడ్జెట్‌లో పేదవర్గాలు లబ్ధిపొందే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.

- కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఎమ్మెల్యే


గోల్‌మాల్‌ బడ్జెట్‌

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌గా ఉంది. రాష్ట్ర ఆదాయానికి, కేటాయింపులకు, ఖర్చులకు పొంతనలేదు. 2,91,159 కోట్ల బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చేవే 70 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అని ప్రకటించిన కాంగ్రెస్‌ బడ్జెట్‌లో ఆ ప్రస్థావనే లేదు. వృద్ధాప్య, వింతతువులు, దివ్యాంగుల పెన్షన్‌ పెంపుదల, కేటాయింపుల గురించి విస్మరించారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తామే కేటాయించినట్టు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. బడ్జెట్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయింపుల గురించి కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌లో డొల్లతనమే ఎక్కువగా ఉంది. అప్పులు కట్టేందుకు అప్పులు చేసేందుకే రేవంత్‌ సర్కార్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

- చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే


బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీట

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యరంగం కోసం రూ.11,468కోట్లను కేటాయించడం వల్ల ప్రజాఆరోగ్య సమస్యలపట్ల, పేదవారి పట్ల ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ నిధులు వైద్యశాఖకు సక్రమంగా ఉపయోగపడేలా ప్రభుత్వపెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, వైద్య అధికారులను నియమిస్తే పేదలకు మేలు జరుగుతుంది.

- డాక్టర్‌ మల్లు ప్రసాద్‌, రిటైర్డ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జెక్‌ కాలనీ, సనత్‌నగర్‌


నగరంలో సౌకర్యాలపై దృష్టి

హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. దీని ద్వారా నగరంలో మరింత మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వచ్చే వీలు కలుగుతుంది. అంతేకాకుండా మూసీ నది కోసం, మెట్రో విస్తరణ కోసం కూడా నిధులు కేటాయించటం మంచి నిర్ణయంగా చెప్పకోవచ్చు. మహానగరంగా విస్తరించిన నగరంలో ఎప్పటికప్పుడు సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించాడానికి వీలుంటుంది.

- సి.రమ్య, ఎకౌంట్స్‌ ప్రొఫెసర్‌


నిరుద్యోగ భృతి ఊసేలేదు

కాంగ్రెస్‌ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీపై మాట తప్పింది. ఈ బడ్బెట్‌లో కనీసం నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి మాటకూడా చెప్పలేదు. బడ్బెట్‌పై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. ప్రతి యేటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో కనీసం ఆ ప్రస్తావన కూడా రాలేదు. ఈ బడ్జెట్‌ నిరుద్యోగుల్లో మరింత నిరుత్సాహాన్ని నింపింది.

- వెంకటేష్‌, నిరుద్యోగి


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 11:57 AM

Advertising
Advertising
<