Hyderabad: ఒరిగిన ఐదు అంతస్తుల భవనం
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:28 AM
అరవై గజాల స్థలంలో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. పక్కనే సెల్లార్ కోసం తవ్వడంతో ఈ భవనానికి ముప్పు ఏర్పడింది. దానికే కాదు. పక్కనే ఉన్న మరిన్ని భవనాలకూ ప్రమాదం ఏర్పడింది. భవనం ఓ వైపు ఒరగగానే అందులో నివాసం ఉంటున్న వారందరూ భయంతో పరుగులు తీశారు.
- 60 గజాల్లో నిర్మాణం.. పక్కనే సెల్లార్ తవ్వకంతో ఘటన
- భయంతో పరుగులు తీసిన నివాసితులు
- గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్‌లో కలకలం
హైదరాబాద్: అరవై గజాల స్థలంలో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. పక్కనే సెల్లార్ కోసం తవ్వడంతో ఈ భవనానికి ముప్పు ఏర్పడింది. దానికే కాదు. పక్కనే ఉన్న మరిన్ని భవనాలకూ ప్రమాదం ఏర్పడింది. భవనం ఓ వైపు ఒరగగానే అందులో నివాసం ఉంటున్న వారందరూ భయంతో పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందా అని ఆందోళనతో గుమిగూడారు. కొండాపూర్ డివిజన్ సిద్ధిఖ్‌నగర్(Kondapur Division Siddiqnagar)లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు కేసుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hydakabad: ‘ఉస్మానియా’లో పందికొక్కులు
మణికొండ(Manikonda)లో నివాసముండే లక్ష్మణ్.. సిద్ధిక్‌నగర్ రోడ్డు నంబరు 1లోని తన 60 గజాల స్థలంలో కొంతకాలం క్రితం ఐదంతస్తుల భవనం నిర్మించాడు. ఇటీవలే ఆ భవనానికి ఆనుకుని ఉన్న స్థలంలో సెల్లార్ కోసం, పిల్లర్ల నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. లక్ష్మణ్ ఇంటికి ఆనుకుని తవ్వడంతో మంగళవారం సాయంత్రం భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.
భవనంలో నివాసముంటున్న కిరాయిదారులు ఆందోళనకు గురై, ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్ అధికారులు(GHMC, Hydra, and police officials) రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 20 , 2024 | 07:28 AM