ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : ఈ-పాస్‌ ద్వారానే ఎరువులు విక్రయించాలి!

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:52 AM

ఎరువుల అమ్మకం కచ్చితంగా ఈ- పాస్‌ ద్వారానే జరగాలని, అది కూడా కొనుగోలుదారు ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

  • కొనుగోలుదారు ఆధార్‌ తప్పనిసరి : వ్యవసాయ శాఖ

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఎరువుల అమ్మకం కచ్చితంగా ఈ- పాస్‌ ద్వారానే జరగాలని, అది కూడా కొనుగోలుదారు ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎరువుల సరఫరాకు సంబంధించి మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతీ జిల్లాలో 5 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌ తప్పనిసరిగా బఫర్‌ స్టాక్‌ ఉంచాలని ఆదేశించారు. పీఏసీఎ్‌సలు, డీసీఎంఎస్‌, ఏఆర్‌కేఎ్‌సలు, మ్యాక్స్‌లను రిటైలర్లుగా పరిగణిస్తామని, ఈ సంస్థలు ఎరువులను రైతులకు మాత్రమే విక్రయించాలన్నారు.

మరో డీలర్‌కు అమ్మకూడదని పేర్కొన్నారు. యూరియా రేక్‌లో కనీసం 60 శాతం మార్క్‌ఫెడ్‌కు కేటాయించేలా డీఏవో చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ‘పీక్‌ సీజన్‌’లో నిర్దిష్ట డీలర్‌కు రోజుకు 2 ట్రక్కులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 02:52 AM

Advertising
Advertising
<