ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి

ABN, Publish Date - Aug 27 , 2024 | 11:01 AM

జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్‌ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.

హైదరాబాద్: జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్‌ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు. హైడ్రా సంస్థ చేపడుతున్న అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు కేటీఆర్‌, హారీష్‏రావు(KTR, Harish Rao)లు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


జంట నగరాలలోని ప్రజలకు గతం లో తాగునీటిని అందించిన చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిలో అధిక శాతం బీఆర్‌ఎస్‌(BRS) నేతలు ఉన్నందుకే వారు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హైడ్రాకు మద్దతుగా తాము నిలబడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డీ.హెచ్‌. ఉమేష్‌, సీవీ రఘునందన్‌రావు, రాజ్‌కుమార్‌, సత్యనారాయణ, సుశీల్‌గాంధీ, సత్యనారాయణ పాల్గొన్నారు.


..............................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................................

Trains: 30 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు..

- మారనున్న ఉందానగర్‌-లింగంపల్లి ఎంఎంటీఎస్‏ల వేళలు

- సికింద్రాబాద్‌కు గంట ఆలస్యంగా రానున్న సందర్భంగా ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ సిటీ: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో పలు సాధారణ, ఎంఎంటీఎస్‌ రైళ్ల వేళల్లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ఉందానగర్‌(శంషాబాద్‌)- లింగంపల్లి(Vundanagar (Shamshabad)- Lingampally) మార్గంలో నడిచే రెండు ఎంఎంటీఎస్‌ రైళ్ల వేళలను కూడా మార్చాలని డివిజనల్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉందానగర్‌ నుంచి లింగంపల్లికి ఉదయం 5.40గంటలకు బయల్దేరాల్సిన ఎంఎంటీఎస్‌ ఉదయం 6.10 గంటలకు, అలాగే,


లింగంపల్లి నుంచి ఉందానగర్‌కు ఉదయం 5.40గంటలకు చేరుకోవాల్సిన ఎంఎంటీఎస్‌(MMTS) ఉదయం 5.50గంటలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రతిపాదనలకు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఇప్పటికే ఆమోదం తెలిపారని, నెలాఖరు నుంచి కొత్త వేళలు అమలవుతాయని సిబ్బంది వెల్లడించారు. అలాగే, ఈనెల 30నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 7.25గంటలకు వచ్చే దర్బంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇకపై గంట ఆలస్యంగా నగరానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2024 | 11:01 AM

Advertising
Advertising
<