ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పనామా చౌరస్తా వద్ద నాలాలోకి దూసుకెళ్లిన మరో కారు

ABN, Publish Date - Aug 17 , 2024 | 10:55 AM

వనస్థలిపురం(Vanasthalipuram)లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా వద్ద నాలాలోకి కారు దూసుకెళ్లడంతో సకాలంలో, సమయ స్ఫూర్తితో వ్యవహరించి వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబం ప్రాణాలను కాపాడారు.

హైదరాబాద్: వనస్థలిపురం(Vanasthalipuram)లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా వద్ద నాలాలోకి కారు దూసుకెళ్లడంతో సకాలంలో, సమయ స్ఫూర్తితో వ్యవహరించి వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబం ప్రాణాలను కాపాడారు. వనస్థలిపురం ట్రాఫిక్‌ సి.ఐ వెంకటేశ్వర్లు(Traffic CI Venkateshwarlu) తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన జిల్లా వినోద్‌ తన భార్య పిల్లలతో కలిసి హయత్‌ నగర్‌(Hayat Nagar) నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వర్షం పడుతోన్న సమయంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పి పక్కనున్న వర్షపు నీటి నాలాలోకి దూసుకొని వెళ్ళింది.

ఇదికూడా చదవండి: Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..


అది గమనించిన అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సి.ఐ వెంకటేశ్వర్లు సమయ స్ఫూర్తితో వ్యవహరించి కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబము మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం ఎక్స్‌కవేటర్‌ సహాయంలో కారును నాలా నుంచి బయటకు తీశారు. గురువారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో కారు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కారులో ఉన్న వారిని కాపాడిన సిబ్బందిని అధికారులు అభినందించారు.


............................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

JNTU: జేఎన్‌టీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల జోరు..

- రెట్టింపైన సగటు వార్షిక వేతనం

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జోరు పెరిగింది. ప్లేస్‌మెంట్స్‌(Placements) పొందిన విద్యార్థుల సగటు వార్షిక వేతనం గత రెండేళ్లలో రెట్టింపైంది. తాజాగా విడుదలైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఇంజనీరింగ్‌ విభాగంలో జేఎన్‌టీయూకు ఇచ్చిన స్కోరే ఇందుకు నిదర్శనం. 2022లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ స్కోర్‌ 42.77 పాయింట్లు ఉండగా, 2023లో 44.75 పాయింట్లకు, 2024లో 45.78 పాయింట్లకు పెరిగింది. అయితే, ర్యాంకింగ్‌లో మాత్రం మూడేళ్లలో వరుసగా 76, 83, 88 ర్యాంకులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సగటు వార్షిక వేతనం రూ.4 లక్షలు ఉండగా, 2023లో రూ.8లక్షలు నమోదైనట్లు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ పేర్కొంది.


స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ జరిగితే మెరుగైన ర్యాంక్‌

జేఎన్‌టీయూకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2024 స్కోర్‌ పెరిగినప్పటికీ, ర్యాంకింగ్‌ తగ్గడానికి సిబ్బంది కొరత కారణమని భావిస్తున్నట్లు జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆచార్యుల రిక్రూట్‌మెంట్‌ జరిగితే వచ్చే ఏడాది యూనివర్సిటీకి ర్యాంకు తప్పకుండా మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ బాగా పెరిగాయని, కంప్యూటర్‌ సైన్స్‌లో 77శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌ లభించగా, అత్యధిక వేతన ప్యాకేజీ రూ.52 లక్షలు, సగటు వేతనం రూ.13.5 లక్షలు నమోదైందన్నారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాల్లో 64 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించగా, అత్యధికంగా రూ.16లక్షల ప్యాకేజీని విద్యార్థులు అందుకున్నారన్నారు. ఈసీఈ విభాగం నుంచి 56శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించగా, అత్యధిక వేతన ప్యాకేజీ రూ.21లక్షలని ఆయన వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2024 | 10:55 AM

Advertising
Advertising
<