ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lakes: 12 చెరువులు.. 887 అక్రమ నిర్మాణాలు!

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:39 AM

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 12 చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు.

  • హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే చేసి ప్రాథమికంగా గుర్తించిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 12 చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉన్న 12 చెరువులకు సంబంధించి చేసిన సర్వేలో.. 887 దాకా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.


మాదాపూర్‌లోని దుర్గం చెరువు పరిధిలో 224 వరకు ఐదంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, దుకాణాలు, చిన్నా, చితకా కాలనీలున్నట్లు వారు కనుగొన్నారు. అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో 185, కూకట్‌పల్లిలోని అంబీర్‌ చెరువులో 108, అల్లాపూర్‌లోని సున్నం చెరువులో 78, హస్మత్‌పేట్‌లోని బోయిన్‌చెరువులో 125, గోపన్‌పల్లిలోని గోసానికుంటలో 34, పీర్జాదిగూడలోని పెద్ద చెరువులో 27, ఉప్పల్‌లోని నల్లచెరువులో 26, బైరామల్‌గూడలోని మద్దెలకుంటలో 12, దుండిగల్‌లోని చిన్నదామెర చెరువులో 7, చందానగర్‌లోని గంగారం పెద్ద చెరువులో 60, నల్లగండ్లలోని నల్లగండ్ల చెరువులో 1 నిర్మాణం ఉన్నట్లు ఇటీవల గుర్తించారు.


వీటిలో.. మద్దెలకుంట చెరువు 6.64 ఎకరాల నుంచి 4.5 ఎకరాలకు కుచించుకుపోయింది. సున్నం చెరువు 32.51 ఎకరాల నుంచి 15.23 ఎకరాలకు, బోయినిచెరువు 72.16 ఎకరాల నుంచి 64.06 ఎకరాలకు, చిన్నరాయుని చెరువు 48 నుంచి 24 ఎకరాలకు, అంబీర్‌ చెరువు 224 నుంచి 84 ఎకరాలకు, చిన్నదామెర చెరువు 114 నుంచి 100 ఎకరాలకు, దుర్గం చెరువు 160.6 నుంచి 65.12 ఎకరాలకు, నల్లగండ్ల చెరువు 60 నుంచి 32.15 ఎకరాలకు, గంగారం పెద్ద చెరువు 61.01 ఎకరాల నుంచి 50 ఎకరాలకు, ఉప్పల్‌ నల్ల చెరువు 103 నుంచి 65 ఎకరాలకు, పీర్జాదిగూడ పెద్ద చెరువు 49 నుంచి 34 ఎకరాలకు కుచించుకుపోయినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - Aug 31 , 2024 | 03:39 AM

Advertising
Advertising