ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా బంద్..

ABN, Publish Date - Dec 24 , 2024 | 09:40 AM

సాయినగర్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా వివేకానందనగర్‌ ఫీడర్‌ పరిధిలో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌(Boduppal AE N.Venugopal) తెలిపారు.

హైదరాబాద్: సాయినగర్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా వివేకానందనగర్‌ ఫీడర్‌ పరిధిలో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌(Boduppal AE N.Venugopal) తెలిపారు. 11కేవీ మారుతీనగర్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఆయన తెలిపారు. మణికంఠనగర్‌, వివేకానందనగర్‌, శ్రీలక్ష్మినగర్‌, లెక్చరర్స్‌కాలనీ, ఎన్‌ఐఎన్‌కాలనీ, ఐఐసీటీకాలనీ, భీంరెడ్డికాలనీ, అశోక్‌నగర్‌, గ్రీన్‌సిటీకాలనీ, అన్నపూర్ణకాలనీలకు చెందిన వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Dr. K. Lakshman: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ పాలనే..


ఉప్పల్‌ భగాయత్‌లో..

11కేవీ సరస్వతీనగర్‌ ఫీడర్‌ పరిధిలోని సరస్వతీకాలనీ, ఆర్టీఏ కార్యాలయం వీధి, ఎస్‌వీఎం హాస్టల్‌ వీధి, నాగోల్‌ మెట్రోస్టేషన్‌ పరిధిలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, శిల్పారామం ఫీడర్‌ పరిధిలో మధ్యా హ్నం 1:30 నుంచి 2 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఉప్పల్‌ భగాయత్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ బి.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఆనంద్‌బాగ్‌ పరిధిలో..

ఆనంద్‌బాగ్‌ పరిధి 11 కేవీ కళ్యాణ్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌, ఎన్‌ఎండీసీ, ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌, బ్యాంక్‌కాలనీ, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు, ఏఎస్ఎన్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని అనంతసరస్వతీనగర్‌ స్ట్రీట్‌ నెంబర్‌.1, 2, 3, షిర్డీనగర్‌, ఆదర్శనగర్‌లో ఉదయం 11 నుంచి 11:30 గంటల వరకు, ఈస్ట్‌చంద్రగిరి ఫీడర్‌ పరిధిలోని లాల్వాణీనగర్‌, చంద్రగిరికాలనీ, వినాయక్‌నగర్‌లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు.


వినాయకనగర్‌ పరిధిలో..

వినాయకనగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ మినీ ట్యాంక్‌బండ్‌, శారదానగర్‌, దేవీనగర్‌, డైట్‌, ఓల్డ్‌ సఫిల్‌గూడ, ఆర్‌కేనగర్‌, సంతోష్ నగర్‌ ఫీడర్ల పరిధిలోని ఆయా కాలనీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ సుమన్‌క్రిస్టియానా తెలిపారు.

నేరేడ్‌మెట్‌ పరిధిలో..

వాజ్‌పేయినగర్‌ సబ్‌స్టేషన్‌ వార్షిక నిర్వహణ పనుల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీలత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాజ్‌పేయినగర్‌, ఆఫీసర్స్‌ కాలనీ, వెంకటేశ్వర్‌నగర్‌, గీతానగర్‌, బృందావనకాలనీ, జీకే కాలనీ, ప్రేమ్‌నగర్‌, సప్తగిరికాలనీ, వివేకానందపురం, భరణికాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, రాఘవేంద్రహిల్స్‌, అమ్మగూడ, కాకతీయనగర్‌, గీతానగర్‌, ఆఫీసర్‌ కాలనీ, రేణుక నగర్‌, సైనిక్‌ విహార్‌, అంబేడ్కర్‌నగర్‌, మధురానగర్‌, నేరేడ్‌మెట్‌ చౌరస్తా, రామకృష్ణాపురం, బ్యాంక్‌ కాలనీ, బాలాజీకాలనీ, సంతోష్ కాలనీ, అంతయ్యకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఆమె పేర్కొన్నారు.


మౌలాలి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

మౌలాలి ఫీడర్‌ పరిధిలోని ఓల్డ్‌ మౌలాలి, రావునగర్‌, ఎస్పీనగర్‌, హనుమాన్‌నగర్‌, డైమండ్‌హిల్స్‌, గోపాల్‌నగర్‌, మహాలక్ష్మి టెంపుల్‌, ఆండాల్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో నేడు మధ్యాహ్నం 12 నుంచి 12:30 గంటల వరకు, కృష్ణానగర్‌ ఫీడర్‌ పరిధిలోని కృష్ణానగర్‌, మంగాపురం పరిసర ప్రాంతాల్లో ఉదయం 11:30 నుంచి 12 గంటల వరకు, కైలాసగిరి ఫీడర్‌ పరిధిలోని హెచ్‌బీకాలనీ, మంగాపురం, భక్షిగూడ, ఇందిరానగర్‌, కైలాసగిరి, నవోదయనగర్‌, రాజీవ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్‌స్టేషన్‌ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.


నోమా ఫీడర్‌ పరిధిలో..

మల్లాపూర్‌ సబ్‌స్టేషన్‌ నోమా ఫీడర్‌ పరిధిలో నేడు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ నాగరాజు తెలిపారు. నర్సింహనగర్‌కాలనీ, శివహోటల్‌, ఏపీ కాలనీ, ఎన్టీఆర్‌నగర్‌, ఎస్‌ఎస్ నగర్‌, మీర్‌పేట్‌, సాయిగార్డెన్స్‌ కాలనీల్లో మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ ఉండదని ఆయన పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 09:40 AM