Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:47 AM
మంజీరా పైపులైన్ లీకేజీకి మరమ్మతు నేపథ్యంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు ప్రకటించింది.
- రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ సిటీ: మంజీరా పైపులైన్ లీకేజీకి మరమ్మతు నేపథ్యంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు ప్రకటించింది. హైదరాబాద్(Hyderabad)కు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు(Patancheru) వరకు 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్‌కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Uttam: సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ పొందండి
దీంతో ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్(RCpuram, Ashoknagar, Jyotinagar, Lingampally, Chandanagar), గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు
ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 10 , 2024 | 11:47 AM