ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జూబ్లీహిల్స్‌ నాలా ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు..

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:15 AM

జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

- పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఇందులో వాస్తవాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా జీహెచ్‌ఎంసీని కోరింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు


దీంతో ముగ్గురు ఇంజనీరింగ్‌ అధికారులు రోడ్డు నంబరు 36లో పర్యటించారు. జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌(Jubilee Hills Police Station) వద్ద నాలా ఆక్రమణకు గురైనట్టు అధికారులు నిర్థారించారు. అనంతరం నాలా వెడల్పును తగ్గిస్తూ వ్యాపార సముదాయాలు వెలిసినట్టు తేలింది. కొన్ని ప్రాంతాల్లో నాలా కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు నివేదిక రూపొందించి హైడ్రాకు అందించనున్నారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................................

Hyderabad: 20న కేబీఆర్‌ పార్కులో ప్రజా సంబురాలు

హైదరాబాద్‌ సిటీ: ప్రజా పాలనలో భాగంగా మన సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ఈనెల 20న కేబీఆర్‌ పార్కు(KBR Park)లో ప్రజా సంబురాలను నిర్వహిస్తున్నామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) తెలిపారు. ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బుధవారం ప్రజా సంబురాల నిర్వహణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేచర్‌, కల్చర్‌, ఆర్ట్‌, క్రాప్ట్‌, అడ్వెంచర్‌ తదితర కాంపిటీషన్స్‌ నిర్వహిస్తారని పేర్కొన్నారు.


కేబీఆర్‌ పార్కుకు 9 గేట్లు ఉన్నాయని, ఒక్కో గేటు వద్ద ఒక్కో యాక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మున్ముందు ప్రజల సందడి ఉన్నచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్లు నళిని పద్మావతి, పంకజ, వేణుగోపాల్‌ రెడ్డి, చీఫ్‌ హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ సునంద, డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంతి పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..

ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం

ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2024 | 11:15 AM