ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గ్రేటర్ కాంగ్రెస్‏లో గడబిడ..

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:03 AM

కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో పాత, కొత్త నాయకుల మధ్య వార్‌ మొదలైంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల సందర్భంలో విభేదాలు బహిర్గతమవుతుండగా, టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి దీప్‌దాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో సైతం బయటపడ్డాయి.

- కొత్తగా వచ్చిన నేతల తీరుపై సీనియర్ల అసంతృప్తి

- మేయర్‌ తీరుపై పలువురి అభ్యంతరాలు

- తాజా సమావేశంలో విభేదాలు బట్టబయలు

- కలుపుకొని పోవాలని అగ్రనేతల సూచనలు

‘పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. పార్టీ పిలుపు మేరకు నగరంలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేశాం. ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు.’ అంటూ గ్రేటర్‌లోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తమ అసంతృప్తిని బయటపెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ అధిష్ఠానం జరిపిన సమీక్షలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మో.. ఔటర్‌ రింగ్‌రోడ్డు..


హైదరాబాద్‌ సిటీ: కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో పాత, కొత్త నాయకుల మధ్య వార్‌ మొదలైంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల సందర్భంలో విభేదాలు బహిర్గతమవుతుండగా, టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి దీప్‌దాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో సైతం బయటపడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ పటిష్ఠతపై టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ గాంధీభవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ముఖ్య కాంగ్రెస్‌ నేతలను సమావేశానికి ఆహ్వానించారు.


హైదరాబాద్‌(Hyderabad) జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జి నేతలు, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Khairatabad, Hyderabad, Secunderabad) డీసీసీల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తమకు పార్టీ కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని పాత నాయకులంతా మొరపెట్టుకున్నారు. పార్టీ కార్యక్రమాల సందర్భంలో, ఫ్లెక్సీల ఏర్పాటులో తమను అవమానిస్తున్నారని తెలిపారు.


మేయర్‌ తీరుపై అభ్యంతరాలు..

మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తీరుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కార్పొరేటర్లను కలుపుకొని పోవడం లేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించకుండా తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నేత పి.విజయారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి, అజారుద్దీన్‌, ఫిరోజ్‌ఖాన్‌ ఇలా పలువురు నేతలు తమకు ఎదురైన ఇబ్బందులను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలిసింది. ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే తనపై దాడికి ప్రయత్నించిన సందర్భంలో పార్టీ నుంచి పూర్తిస్థాయిలో మద్దతు రాలేదని, అండగా నిలుస్తూ కనీసం ప్రకటనలు కూడా చేయలేదని సమావేశంలో నాంపల్లికి చెందిన నేత ప్రస్తావించినట్లు తెలిసింది.


ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్‌ అధికారాల బదిలీ

ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2024 | 09:03 AM