Hyderabad: కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - May 01 , 2024 | 10:25 AM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న కాంగ్రెస్ పార్టీ(Congress Party) రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న కాంగ్రెస్ పార్టీ(Congress Party) రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూసాపేట చిత్తారమ్మ ఆలయం వద్ద, చందానగర్‌లోని తుల్జాభవానీ మందిరం వద్ద ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని తెలిపారు.
ఇదికూడా చదవండి: TG: అనర్హత పిటిషన్ల నెపంతో రాజకీయం: పాడి కౌశిక్ రెడ్డి
భరత్‌నగర్ బ్రిడ్జి నుంచి కైతలాపూర్ వైపునకు వెళ్లే వాహనాలను మూసాపేట వైపు పంపుతారు. హైటెక్ సిటీ(Hi-tech city) నుంచి కూకట్‌పల్లి వచ్చే వాహనాలను కేపీహెచ్‌బీ 4ఫేజ్, లోధా అపార్ట్‌మెంట్ వైపు పంపుతారు. బాలానగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కూకట్‌పల్లి, ఐడీఎల్ లేక్ వైపు పంపుతారు. అదే విధంగా హెచ్‌సీయూ నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్లే వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు.
ఇదికూడా చదవండి: TG: నా గుండుతో నీకేం పని రేవంతన్నా.. బండి సంజయ్‌కుమార్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 01 , 2024 | 10:25 AM