ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద కుంగిన రోడ్డు..

ABN, Publish Date - Jul 17 , 2024 | 12:25 PM

ఉప్పల్‌లో జాతీయ రహదారి(National Highway)పై అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. ఫ్లైఓవర్‌ కోసం రోడ్డు మధ్యలో నిర్మించిన పిల్లర్‌కు దగ్గరగా వెళ్లిన డ్రైవర్‌ కారును ఆపడంతో అక్కడ మట్టి ఒక్కసారిగి కుంగి, పెద్ద గొయ్యి ఏర్పడింది.

హైదరాబాద్: ఉప్పల్‌లో జాతీయ రహదారి(National Highway)పై అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. ఫ్లైఓవర్‌ కోసం రోడ్డు మధ్యలో నిర్మించిన పిల్లర్‌కు దగ్గరగా వెళ్లిన డ్రైవర్‌ కారును ఆపడంతో అక్కడ మట్టి ఒక్కసారిగి కుంగి, పెద్ద గొయ్యి ఏర్పడింది. కారు ముందు టైరు గుంతలో ఇరుక్కుపోగా, అప్రమత్తమైన డ్రైవర్‌... ఇంజన్‌ను ఆపి, బయటకు వచ్చి ఇతరుల సహాయంతో కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఫ్లైఓవర్‌ పిల్లర్‌ సమీపంలో రోడ్డు మొత్తం తడిసి ముద్దయింది. అంతకు ముందు ఫ్లైఓవర్‌ పిల్లర్‌ పునాది కోసం గుంతను తవ్వి పిల్లర్‌ నిర్మించాక, దానిని మట్టితో పూడ్చివేశారు.

ఇదికూడా చదవండి: బోనాల చెక్కుల పంపిణీలో రాజకీయాలు వద్దు..


గుంతలో మట్టి సరిగా సర్దుకోకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు భూమి లోపలి భాగంలో మట్టి నాని కూరుకు పోవడంతోనే రోడ్డు కుంగింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు(GHMC project) విభాగం ఇంజనీర్లు సంఘటన స్థలానికి చేరుకొని మట్టిపోసి గుంతను పూడ్చివేశారు. అయితే మిగతా పిల్లర్ల సమీపంలో కూడా రోడ్డు కుంగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గరుండి పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పలువురు కామెంట్‌ చేశారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 12:25 PM

Advertising
Advertising
<