ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కుమారుడిని కరిచిందని కుక్కను చంపేశాడు..

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:38 PM

తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి కుక్కను రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు విసిరి చంపేశాడు. స్థానికుల హృదయాలను కలిచివేసిన ఈ పాశవిక ఘటన షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌(Shahinayatganj Police Station) పరిధిలో శనివారం జరిగింది.

- రెండంతస్తుల భవనంపైనుంచి కిందకు విసిరేసిన వైనం

- అడ్డుకోబోయిన స్థానికులపై రాడ్డుతో దాడి

హైదరాబాద్: తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి కుక్కను రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు విసిరి చంపేశాడు. స్థానికుల హృదయాలను కలిచివేసిన ఈ పాశవిక ఘటన షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌(Shahinayatganj Police Station) పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ చౌహాన్‌ తెలిపిన వివరాల ప్రకారం... జుమ్మెరాత్‌బజార్‌లోని దేవీనగర్‌ ఉప్పలమ్మ గుడి ప్రాంతంలో సత్యనారాయణ (40) అనే వ్యక్తి నివసిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: యూకే నుంచి వచ్చి.. మృత్యుఒడికి చేరి


దీపావళి పండుగ నేపథ్యంలో సత్యనారాయణ(Satyanarayana) కుమారుడు టపాసులు కాల్చి అక్కడే ఉన్న కుక్కపై వేశాడు. అది బాధతో విలవిల్లాడుతూ అక్కడి నుంచి పరుగుతీసింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి అక్కడికి వచ్చిన కుక్క నేరుగా వెళ్లి టపాసులు వేసిన సత్యనారాయణ కుమారుడిని కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన సత్యనారాయణ నా కుమారుడినే కరుస్తావా.. అంటూ కుక్కపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు.


తర్వాత దానిని రెండంతస్తుల భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి విసిరేశాడు. దీంతో కుక్క అక్కడికక్కడే ప్రాణం విడిచింది. కాగా, ఈ కిరాతక చర్యను అడ్డుకోబోయిన స్థానికులపైనా సత్యనారాయణ రాడ్‌తో దాడి చేశాడు. ఈ మేరకు షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

ఈవార్తను కూడా చదవండి: Rahul Gandhi: 5న రాష్ట్రానికి రాహుల్‌

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మార్ట్‌లో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం

ఈవార్తను కూడా చదవండి: TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 03 , 2024 | 12:38 PM