ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి కృషి..

ABN, Publish Date - Aug 11 , 2024 | 08:19 AM

తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్‌ కల్చర్‌ వీక్‌ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.

- చంద్రబాబు ముందుచూపుతోనే జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు

- మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి

- కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Minister Ram Mohan Naidu) అన్నారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్‌ కల్చర్‌ వీక్‌ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లోని జీఎంఆర్‌ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు(శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుల్లో ఒకటని, అందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని(AP Chief Minister Chandrababu Naidu) చెప్పారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో అమ్మాయిల నకిలీ వివరాలతో మోసం..


చంద్రబాబు ముందుచూపుతో నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకని ఆనాడు కొందరు ప్రశ్నించారని, అయితే, అప్పటి దూరదృష్టితో నేడు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు(GMR Airport) ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి? ఎక్కడ ప్రజారవాణాకు అవకాశం ఎక్కువ ఉంది? ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుకూలమైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీస్తున్నామని తెలిపారు.


దేశంలోని విమానాశ్రయాల్లో ప్రపంచ స్థాయి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. విమానాశ్రయాల్లోని భద్రతా సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని, పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు నేడు ఈ స్థాయికి రాగలిగిందంటే సిబ్బందితో పాటు సీఐఎస్ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌(CISF, CRPF) వంటి భద్రతా సిబ్బందే కారణమన్నారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది, ఎయిర్‌పోర్టు అధికారులు.. ప్రయాణికులకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు.


తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ మాట్లాడుతూ జీఎంఆర్‌ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, జీఎంఆర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 11 , 2024 | 08:19 AM

Advertising
Advertising
<