Hyderabad: మూతపడిన ఈవెనింగ్ క్లినిక్స్..
ABN, Publish Date - Dec 26 , 2024 | 07:25 AM
ఆరోగ్య కేంద్రాల్లో ఈవెనింగ్ క్లినిక్స్(Evening Clinics) సేవలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కొద్ది నెలల నుంచి సాయంత్రం క్లినిక్‌లు తెరవకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- సమాచారం ఇచ్చేవారు లేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న రోగులు
హైదరాబాద్ సిటీ: ఆరోగ్య కేంద్రాల్లో ఈవెనింగ్ క్లినిక్స్(Evening Clinics) సేవలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కొద్ది నెలల నుంచి సాయంత్రం క్లినిక్‌లు తెరవకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యుపీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో సాయంత్రం సమయాల్లో ప్రత్యేక వైద్యం అందించేందకు గతంలో ఈవెనింగ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, పిల్లలు, గైనిక్, మానసిక తదితర సేవలను అందించారు.
ఈ వార్తను కూడా చదవండి: Bhuvanagiri: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన వైద్యులను, కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరు వైద్యులను నియమించి సేవలను అందించారు. ఈవెనింగ్ క్లినిక్‌లలో రోగులకు ఒక్కోరోజు ఒక్కో విభాగానికి చెందిన వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించారు. దీంతో ఈవెనింగ్ క్లినిక్‌లకు ఆదరణ పెరిగింది. అయితే, గత నెల రోజుల క్రితం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో ఈ సేవలను నిలిపివేశారు.
క్లినిక్స్ మూతపడటంతో..
ఈవెనింగ్ క్లినిక్స్ మూతపడటంతో ఇప్పుడు చాలామంది రోగులు పెద్దాస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్(Private clinic)లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అయితే, చాలా మందికి ఈవెనింగ్ క్లినిక్స్ మూతపడిన విషయం తెలియకపోవడం, అక్కడ సమాచారం ఇచ్చే వారు ఎవరూ లేకపోవడంతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వెనుతిరుగుతున్నారు. ఈ క్లినిక్‌లను ఇకముందైనా తెరుస్తారా... లేదా...? అనే సమాచారం ఎవరూ చెప్పడం లేదు. దీంతో చాలా మంది రోగులు రోజూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 26 , 2024 | 07:25 AM