ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:50 AM

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ(Telangana)కు తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు ఆరోపించారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలన్నారు.

- ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ(Telangana)కు తీవ్ర అన్యాయం జరిగిందని వక్తలు ఆరోపించారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధులు కేటాయించాలన్నారు. సెక్యులర్‌ డెమోక్రటిక్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌(Somajiguda Press Club)లో కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీఎస్‌ జేఏసీ అధ్యక్షుడు కోల జనార్దన్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, తెలంగాణ జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్థన్‌, తెలంగాణ లోక్‌ సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, ఓట్‌ నీడ్‌ గ్యారెంటీ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు సొగరా బేగం, కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ మల్లాది, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు చామకూర రాజు, ఇస్లాముద్దీన్‌, కేవీ గౌడ్‌, కె.సత్యనారాయణ, తదితరులు మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. రాష్ట్ర బడ్జెట్‌పై నగరవాసుల స్పందన


ప్రభుత్వాలు పక్షపాతం లేకుండా పాలన చేయాలని జస్టిస్‌ చంద్రకుమార్‌(Justice Chandrakumar) అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్‌(Finance Minister Nirmila Sitharaman)తో మాట్లాడి రాష్ట్రానికి నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. వారితో ప్రకటన చేయించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఢిల్లీకి వెళ్లి ఎనిమిదిసార్లు ప్రధానిని, 18 సార్లు మంత్రులను కలిసినా ఒక్క రూపాయి కూడా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించకపోవడం దుర్మార్గమని మల్లాది పవన్‌ అన్నారు.


రాష్ట్ర ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రొఫెసర్‌ కోదండరాం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారని, ఆయన కేసీఆర్‌ చెప్పినట్టే ఉద్యమాలు చేశారనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని సొగరా బేగం అన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు జితేంద్ర చారి, స్నేహారెడ్డి, సుభద్రా రెడ్డి, రమేష్‌, నర్సింహ, ఉపేందర్‌, ఇస్మాయిల్‌ షేక్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 12:12 PM

Advertising
Advertising
<