ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: తొలగించినవి తక్కువ.. చేర్చినవి ఎక్కువ!

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:32 AM

హైదరాబాద్‌(Hyderabad) జిల్లాలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటించిన తుది జాబితా ప్రకారం నగరంలోని 15 శాసనసభా నియోజకవర్గాల్లో 45.70 లక్షల ఓటర్లుండగా, ఇప్పుడా సంఖ్య 45.91 లక్షలకు పెరిగింది. 60.23 లక్షల జనాభా ఉన్నట్టు అంచనా వేయగా, అందులో 76 శాతం ఓటర్లున్నారు.

- జిల్లాలో స్వల్పంగా పెరిగిన ఓటర్లు

- తుది జాబితాతో పోలిస్తే 21 వేలు అధికం

- సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో తొలగింపు అధికం

- జిల్లా ఓటర్లు 45.91 లక్షలు

- జనాభాలో 76 శాతం ఓటర్లు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌(Hyderabad) జిల్లాలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటించిన తుది జాబితా ప్రకారం నగరంలోని 15 శాసనసభా నియోజకవర్గాల్లో 45.70 లక్షల ఓటర్లుండగా, ఇప్పుడా సంఖ్య 45.91 లక్షలకు పెరిగింది. 60.23 లక్షల జనాభా ఉన్నట్టు అంచనా వేయగా, అందులో 76 శాతం ఓటర్లున్నారు. మొత్తంగా జిల్లాలో ఓటర్ల సంఖ్య 21 వేలకుపైగా పెరిగింది. షెడ్యూల్‌ ప్రకటన అనంతరం ఓటరు నమోదుకు 1.30 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1.25 లక్షల దరఖాస్తులను ఆమోదించడంతో కొత్తగా వారి పేర్లు జాబితాలో చేరాయి. గత తుది జాబితా నుంచి 1.04 లక్షల పేర్లను జీహెచ్‌ఎంసీ(GHMC) తొలగించింది. దీర్ఘకాలంగా ఓటు వేయని(ఆబ్‌సెంట్‌), చిరునామా మారడం (షిఫ్టింగ్‌), మరణించడం(డెత్‌) వంటి కారణాలతో ఫిబ్రవరి 8 తర్వాత షెడ్యూల్‌ విడుదలకు ముందు ఆ ఓటర్లను తొలగించినట్టు ఓ అధికారి చెప్పారు. తొలగింపు వల్ల పెరిగిన ఓటర్ల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించడం లేదు. వాస్తవంగా అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, ఏ ఎన్నికలున్నా ఓటర్ల నమోదుపై పార్టీలు, వ్యక్తులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమంలోనే 1.30 లక్షల ఫారం-6 దరఖాస్తులు జీహెచ్‌ఎంసీకి వచ్చాయి.

ఇదికూడా చదవండి: JP Nadda: వికసిత్‌ భారత్‌ కోసమే ఈ ఎన్నికల..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అధికం

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓటర్లను తొలగించారు. లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 53,404 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తీసేశారు. ఇందులో అత్యధికంగా ముషీరాబాద్‌లో దాదాపు 14 వేలు, జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో 10 వేలకుపైగా, అత్యల్పంగా నాంపల్లిలో 4,001 ఓటర్లను తొలగించారు. నాంపల్లిలో భారీ స్థాయిలో బోగస్‌ ఓటర్లున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడే తక్కువ మంది పేర్లు తొలగించడం గమనార్హం. గతంలోనే నాంపల్లిలో బోగస్‌ ఓటర్లను తొలగించామని ఓ అధికారి చెప్పారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 46 వేలకుపైగా ఓటర్లను జాబితా నుంచి తీసేశారు. అత్యధికంగా చాంద్రాయణగుట్టలో 14,500కుపైగా.. కార్వాన్‌లో 9 వేలకు పైగా, అత్యల్పంగా చార్మినార్‌లో 2500కుపైగా ఓటర్లను తొలగించారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో 4,300కుపైగా ఓటర్లను తొలగించారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, కార్వాన్‌, గోషామహల్‌(Jubilee Hills, Secunderabad, Karwan, Goshamahal) నియోజకవర్గాల్లో తొలగించిన ఓటర్ల కంటే కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం.

ఇదికూడా చదవండి: Khammam: బీజేపీ, బీఆర్‌ఎస్‌, అవినీతి పార్టీలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:32 AM

Advertising
Advertising