Hyderabad: 13 ఏళ్లుగా.. పైసా చెల్లించకుండా..
ABN, Publish Date - Sep 13 , 2024 | 10:43 AM
జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రకటనల విభాగంలో మరో మాయాజాలమిది. అక్రమ హోర్డింగులు, లాలిపాప్స్ ఏర్పాటుకు సహకరించడమే కాదు.. దశాబ్దానికిపైగా సంస్థకు పైసా రుసుము చెల్లించని ఏజెన్సీలకు అధికారులు పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు.
- జీహెచ్‌ఎంసీ ఆదాయానికి అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీ గండి
- లాలిపాప్స్ అద్దెకిస్తూ రూ.. కోట్లలో ఆర్జిస్తున్న సంస్థ
- కోర్టు మెట్లు ఎక్కి.. ఒప్పందం కొనసాగింపు
- మధ్యంతర ఉత్తర్వులు వెకేట్ చేయించడంలో అధికారులు విఫలం
- ఏజెన్సీతో కుమ్మక్కవడమే ప్రధాన కారణం
- బల్దియాకు రూ.15 కోట్లు నష్టం
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రకటనల విభాగంలో మరో మాయాజాలమిది. అక్రమ హోర్డింగులు, లాలిపాప్స్ ఏర్పాటుకు సహకరించడమే కాదు.. దశాబ్దానికిపైగా సంస్థకు పైసా రుసుము చెల్లించని ఏజెన్సీలకు అధికారులు పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. ఒప్పంద గడువు ముగిశాక తప్పుకోవాల్సిన ఓ ఏజెన్సీ.. కోర్టు గడప తొక్కి యథాతథంగా కొనసాగుతుండగా వారికి అధికారులు వంత పాడుతున్నారు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేసేలా కనీస ప్రయత్నం చేయడం లేదు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి రూ.15 కోట్ల మేర గండి పడింది. గ్రేటర్‌లోని లాలిపా్‌పలు, బస్‌షెల్టర్లు, ఇతర ప్రకటనల బోర్డులను టెండర్ ప్రక్రియ ద్వారా జీహెచ్‌ఎంసీ(GHMC) ఏజెన్సీలకు అప్పగిస్తోంది.
ఇదికూడా చదవండి: Harish Rao: హరీష్ రావు హౌస్ అరెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా ముందుస్తు అరెస్టులు
సంస్థకు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ముందుకు వచ్చిన ఏజెన్సీని ఎంపిక చేస్తారు. మూడు నుంచి ఐదేళ్ల గడువుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. మొదటి సంవత్సరం ఎంత చెల్లించాలి? ఏటా రుసుము ఎంత శాతం పెరుగుతుందన్నది ఒప్పందంలో ఉంటుంది.
నాలుగు కీలక మార్గాల్లో...
జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని ఫిల్మ్‌నగర్ నుంచి జూబ్లీచెక్ పోస్ట్, మాసాబ్ ట్యాంక్(Jubilee Check Post, Masab Tank) నుంచి లక్డీకాపూల్ చౌరస్తా, బేగంపేట వరుణ్ మోటార్స్ టు షాపర్స్ స్టాప్, ఐ మ్యాక్స్ ముందుండే కీలక మార్గాలోని సెంట్రల్ మీడియన్ల లాలిపా్‌పలను ఉమ్మడి రాష్ట్రంలో ఐక్యాచ్ ఏజెన్సీకి అప్పగించారు. 2011లోనే సదరు సంస్థ కాలపరిమితి ముగియగా.. అదే ఏడాది కోర్టుకు వెళ్లింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఒప్పందం కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
13 ఏళ్ల క్రితం కోర్టు ఆదేశాలివ్వగా.. ఇప్పటి వరకు ఆర్డర్ వెకేట్ చేసేలా బల్దియా ప్రకటనల విభాగం కనీస ప్రయత్నం చేయలేదు. వాస్తవంగా ఒప్పందంలో ఏముంది? ఏజెన్సీ వాదన ఏమిటి? బల్దియాకు ఎంత నష్టం జరుగుతుందన్నది? స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ప్రకనటల విభాగం అధికారులు పట్టించుకోలేదు. గతంలోని స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులూ ఈ విషయంపై అంత దృష్టి సారించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయపరంగా అవసరమైన వివరాలు ప్రకటనల విభాగం ఇవ్వకపోవడం వల్లే కేసు ఇంకా విచారణలో ఉందని చెబుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి..
గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏజెన్సీ జీహెచ్‌ఎంసీకి యేటా రూ.65 లక్షలు చెల్లించాలి. అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రకారం యేటా 10శాతం రుసుము పెరుగుతుంది. ప్రకటనలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రస్తుతం యేటా రూ. కోటి నుంచి రూ.1.5 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశముంది. అధికారుల నిర్లక్ష్యంతో 13 యేళ్లుగా పైసా కూడా రాకపోవడం గమనార్హం. ఏజెన్సీ మాత్రం ఎప్పటిలానే ప్రకటనలకు అద్దెకిస్తు ఆదాయం పొందుతోంది.
కీలకమైన మార్గాల్లో లాలిపా్‌పలు దక్కించుకున్న సంస్థ పూర్వ ఒప్పందం ప్రకారం ప్రకటనల రుసుము, గ్రౌండ్ రెంట్ చెల్లించాలని నోటిసులు ఇచ్చినా ఏజెన్సీ ఖాతరు చేయడం లేదని తెలిసింది. గతంలో ప్రకటన విభాగంలో పని చేసిన పలువురు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టులో కేసు విచారణ కొనసాగించేలా సహకరించారన్న ఆరోపణలున్నా యి. తాజాగా ఈ వ్యవహరం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఏజెన్సీ కొంత రుసుము చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 13 , 2024 | 10:43 AM